
విద్యారంగ సమస్యలను అసెంబ్లీలో చర్చించాలి
నరసరావుపేట ఈస్ట్: అసెంబ్లీ సమావేశాలలో కూట మి ప్రభుత్వం విద్యారంగ సమస్యలపై సమగ్రంగా చర్చించి పరిష్కార దిశగా నిర్ణయాలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర గర్‌ల్స్ కన్వీనర్ లింగిశెట్టి బాలనవ్యశ్రీ డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు నవ్యశ్రీ మాట్లాడుతూ ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన యువగళం పాదయాత్రలో 77, 107, 108 జీఓలను రద్దు చేస్తామని ప్రకటించారని, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం గడిచినా జీఓల రద్దు మాట అటుంచి వైద్యవిద్యను ప్రైవేటు పరం చేసేందుకు నిర్ణయించటం దారుణమన్నారు. ప్రైవేటు పరం చేయటాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేసారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.6,400 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మేకపోతుల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు దాసరి హేమంత్‌కుమార్, ఎం.మధు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.6,400 కోట్లు విడుదల చేయాలి
ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర బాలికల కన్వీనర్
బాలనవ్యశ్రీ