
బీచ్ ఫెస్టివల్ పోస్టర్ ఆవిష్కరణ
బాపట్ల టౌన్: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు సూర్యలంక తీరంలో జరుగనున్న బీచ్ ఫెస్టివల్‌కు సంబంధించిన వాల్ పోస్టర్లను బుధవారం అమరావతి సచివాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు. మంత్రులు కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు కొండయ్య యాదవ్, నరేంద్ర వర్మ, ఏలూరి సాంబశివరావు, నక్క ఆనందబాబులు పాల్గొన్నారు.
ఆశ్రమ నిర్వాహకుడు
చందుకు అవార్డు
మార్టూరు: మార్టూరులోని అమ్మ ఆశ్రమ నిర్వాహకుడు గుంటుపల్లి చందు తన సేవలకు గాను అరుదైన పురస్కారం అందుకున్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా చైన్నెలోని చెన్నపురి తెలుగు విశ్వకర్మ సమాజం వారు తాదం కుప్పం బ్రహ్మంగారి ఆలయ ప్రాంగణంలో బుధవారం విశ్వకర్మ జయంతి నిర్వహించారు. వృద్ధులకు చందు నిర్వహిస్తున్న సేవలకు గాను ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విశ్వకర్మ అవార్డు అందజేసి, ఘనంగా సత్కరించారు.
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె చేస్తాం
నరసరావుపేట: విద్యుత్ రంగంలో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించకపోతే సమ్మె బాట పడతామని రాష్ట్ర విద్యుత్ ఎంప్లాయిస్ జేఏసీ నాయకులు ఆర్.బంగారయ్య హెచ్చరించారు. యాజమాన్యం తక్షణమే స్పందించి వాటిని పరిష్కరించాలని ఈ నెల 15వ తేదీ నుంచి దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న ధర్నా కార్యక్రమంలో భాగంగా బుధవారం విద్యుత్ ఉద్యోగులు ఎగ్జిక్యూటీవ్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వందల మంది విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్లు భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారని బంగారయ్య పేర్కొన్నారు. మురళీమోహనప్రసాదు, షేక్ నజియా, గోపాలరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
నేడు డీఎస్సీ సెలెక్టడ్
అభ్యర్థులకు ఐడీ కార్డులు
గుంటూరు ఎడ్యుకేషన్: డీఎస్సీ–2025 ద్వారా ఉపాధ్యాయులగా ఎంపికై న అభ్యర్థులు ఈనెల 19న అమరావతిలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోనున్న దృష్ట్యా సంబంధిత కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా గురువారం ఐడీ కార్డులు జారీ చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఎంపికై న అభ్యర్థులు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరు నగరంలోని పొన్నూరు రోడ్డులో ఉన్న ఆంధ్ర ముస్లిం కళాశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు తమ పొటోతో పాటు వెంట వచ్చేవారికి సంబంధించిన పాస్‌పోర్ట్ ఫొటో, ఐడీ కార్డును తెచ్చుకోవాలని ఆమె సూచించారు.
గవర్నర్‌కు ఆహ్వానం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై 22వ తేదీ నుంచి నిర్వహించే దసరా ఉత్సవాలకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు దేవదాయ శాఖ అధికారులు ఆహ్వాన పత్రికను అందజేశారు. బుధవారం గవర్నర్‌ను దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, దుర్గగుడి ఈవో శీనానాయక్‌లతో పాటు ఆలయ అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అంతకు ముందు దసరా ఉత్సవాల ఏర్పాట్ల గురించి దేవదాయ శాఖ కమిషనర్ గవర్నర్‌కు వివరించారు.

బీచ్ ఫెస్టివల్ పోస్టర్ ఆవిష్కరణ