బాపట్ల టౌన్: బాపట్ల, నగరం మండలాల్లో ఈనెల 16,17 తేదీల్లో స్కూల్ గేమ్స్ అండర్ 14,17 బాలబాలికల టీంలు ఎంపికలు నిర్వహించనున్నట్లు సెక్రటరీ కె. వెంకటేశ్వరరావు తెలిపారు. బీచ్ వాలీబాల్ పోటీల ఎంపిక బాపట్ల మండలంలోని ముత్తాయపాలెం జిల్లా పరిషత్ హైస్కూలులో, తైక్యాండో పోటీలకు ఎంపిక నగరం మండలంలోని ఉలిపాలెం జిల్లా పరిషత్ హైస్కూలులో జరుగుతాయని పేర్కొన్నారు. అండర్–14 పోటీలకు విద్యార్థులు 1–1–2012 తర్వాత, అండర్ –17 పోటీలకు విద్యార్థులు 1–1–2009 తర్వాత జన్మించి ఉండాలని పేర్కొన్నారు. పోటీలకు హాజరయ్యే విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకంతో కూడిన ఎంట్రీ ఫామ్, ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రంతో హాజరుకావాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఐటీఐ, పాలిటెక్నికల్, ఓపెన్ స్కూల్ విద్యార్థులు అనర్హులని పేర్కొన్నారు.
అద్దంకి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలైన సంఘటన పట్టణంలోని భవానీ సెంటర్‌లో ఆదివారం జరిగింది. ఎన్టీర్ కాలనీకి చెందిన యర్రమోతు అంజయ్య బైకుపై పట్టణంలోకి వెళ్తున్నాడు. ఈ క్రమంలో భవానీ సెంటర్‌లో శింగరకొండ వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది బాధితుడిని తొలుత అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు వైద్యశాలకు తరలించారు.
నగరంపాలెం: స్థానిక చుట్టుగుంట కూడలిలోని టుబాకో బోర్డు రైతు భవన్‌లో ఆదివారం భారత పొగాకు బోర్డు పెన్షనర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల వలె హెల్త్ పాలసీ పొగాకు బోర్డులో ఉద్యోగ విరమణ పొందిన వారికి వర్తింపచేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. తద్వారా విశ్రాంత ఉద్యోగులు ఆరోగ్య ఖర్చులు పొందుతారని అన్నారు. అసోసియేషన్ గౌరవాధ్యక్షులు వెంకటరావు, మరో ఎనిమిది 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా సన్మానించారు. అసోసియేషన్ అధ్యక్షులు బీఎన్.మిత్ర, సభ్యులు, కర్ణాటక రాష్ట్రం నుంచి హాజరయ్యారు.
రేపటి నుంచి బాలబాలికల టీంలు ఎంపిక