
బాపట్ల
న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 14 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2,10,540 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 2,50,853 క్యూసెక్కులు వదులుతున్నారు.
దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి 3,007 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ఇంకా బ్యారేజీ వద్ద 12 అడుగులు నీటి మట్టం ఉంది.
ఇంద్రకీలాద్రి: బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో జరిగే నిత్యాన్నదానానికి కృష్ణాజిల్లా పోరంకికి చెందిన కొమ్మినేని ప్రతాప్‌కుమార్ దంపతులు శనివారం రూ.లక్ష విరాళం అందించారు.
మీడియా స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం హరించాలనుకోవటం దుర్మార్గం. ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నించే హక్కు మీడియాకు ఉంది. తప్పులను ఎత్తి చూపినప్పుడు వాటిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అది వదిలి ప్రశ్నించిన గొంతుని నొక్కాలనుకోవటం దుర్మార్గమైన రాజకీయ చర్య. వీటన్నిటికి భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సమాజంలో ఫోర్త్ స్టేట్ అయినా మీడియాపై తప్పుడు కేసులు నమోదు చేసి ఎడిటర్లను పోలీస్‌స్టేషన్లకు విచారణ పేరుతో తిప్పించటం కూటమి ప్రభుత్వం పనితీరుకు నిదర్శనం.
– కాసు మహేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, గురజాల
కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను, భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ, ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టడం అప్రజాస్వామికం. సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తపై ఆ పత్రిక ఎడిటర్‌ను బాధ్యున్ని చేస్తూ కేసు నమోదు చేయడం దుర్మార్గం. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాసే హక్కు ఏ ప్రభుత్వానికీ ఉండదు. కూటమి ప్రభుత్వం దాదాపు రూ.2 లక్షల కోట్ల రుణాలు చేసి ప్రభుత్వ భూములను, అభివృద్ధి పేరుతో పందేరం చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అవినీతిపరులుగా మారారు. వారిపై ఎటువంటి కేసులు పెట్టకుండా వారి అవినీతి విషయాలను వెలుగులోకి తీసుకువస్తున్న పత్రికలపై అక్రమ కేసులు బనాయించడం పరిపాటిగా మారింది. సాక్షి దినపత్రిక ఎడిటర్‌పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి.
– వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు, జనచైతన్య వేదిక
7

బాపట్ల

బాపట్ల

బాపట్ల

బాపట్ల

బాపట్ల

బాపట్ల

బాపట్ల