
13న జాతీయ లోక్ అదాలత్
నరసరావుపేట టౌన్: జాతీయ లోక్ అదాలత్‌ను జయప్రదం చేయాలని 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎన్. సత్యశ్రీ కోరారు.
గురువారం కోర్టు ప్రాంగణంలో పోలీస్ అధికారులు, న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహస్తున్నట్లు తెలిపారు. అదాలత్‌లో రాజీ పడదగ్గ క్రిమినల్, సివిల్ కేసులు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని కోరారు. లోక్ అదాలత్‌లో రాజీ పడినట్‌లైతే సివిల్ కేసుల్లో కోర్టు ఫీజు వాపస్ ఇస్తారని తెలిపారు.