
రాష్ట్రస్థాయి ఫెన్సింగ్‌లో పందిళ్లపల్లి విద్యార్థి ప్రత
వేటపాలెం: రాష్ట్రస్థాయి ఫెన్సింగ్‌లో పందిళ్లపల్లి విద్యార్థి ప్రతిభ చాటాడు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎం యతిన్ కార్తికేయ రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించాడని హెచ్‌ఎం తలమల దీప్తి సోమవారం తెలిపారు. ఈ నెల 29, 30వ తేదీల్లో భీమవరంలో 11వ రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలు నిర్వహించారని పేర్కొన్నారు. హెచ్‌ఎం మాట్లాడుతూ విద్యార్థులు చదువులతోపాటు క్రీడల్లో రాణిస్తున్నారన్నారు. భవిష్యత్‌లో ఇదే స్ఫూర్తితో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కర్ణ నాగేశ్వరరావు, తోట వెంకటేశ్వర్లు, స్టాఫ్ సెక్రటరీ బుద్ధి మోహన్‌రావు, లలితా పరమేశ్వరి, శ్రీనివాసరావు, భవానీ దేవి, సూర్యనారాయణ, బ్రహ్మయ్య, ప్రసన్నాంజనేయులు, రాజా పాల్గొన్నారు.