
భర్త నుంచి ప్రాణహాని
నాకు తొమ్మిదేళ్ల కిందట కాకుమాను మండలం కొండపాటూరు గ్రామానికి చెందిన మామిడి పవన్‌తో వివాహం జరిగింది. నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెళ్లి సమయంలో మా తల్లిదండ్రులు కట్నం, బంగారం ఇచ్చారు. పెళ్లి అయిన తర్వాత బిజినెస్ చేస్తానంటే భర్త మాటలు నమ్మాను. నా పేరుతో ఉన్న దస్తావేజులను బ్యాంకులో పెట్టి రూ.5 లక్షలు అప్పు తీసుకొచ్చి ఇచ్చాను. డబ్బులు తీసుకొని వెళ్లిపోయాడు. ప్రతినెలా బ్యాంకుకు ఈఎంఐ చెల్లిస్తానని చెప్పి చెల్లించడం లేదు. ఇదేమని అడిగితే నిన్ను చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడు. నాకు భర్త వల్ల ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించాలి.
– మామిడి దీపిక, పేరలి, కర్లపాలెం మండలం
మా గ్రామానికి చెందిన కారంపూడి శివనాగమల్లేశ్వరరావు, ఆయన భార్య దుర్గామల్లీశ్వరి, కారంపూడి ఈశ్వర్‌కుమార్, ఆయన భార్య కరుణలు నాపై అకారణంగా తరచూ దాడులు చేస్తూ నిత్యం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీనిపై ఆధారాల సహా ఆగస్టు 19న భట్టిప్రోలు ఎస్‌ఐకి ఫిర్యాదు చేశాను. పది రోజులైనా ఎస్‌ఐ నా కేసు గురించి పట్టించుకోవడం లేదు. స్టేషన్‌కు వెళితే అసలు సమాధానం చెప్పడం లేదు.
– చిలకాల సాంబ్రాజ్యం, భట్టిప్రోలు
●

భర్త నుంచి ప్రాణహాని