
బాధితుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
బాపట్లటౌన్: బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 57 మంది బాధితులు వచ్చి తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. ఎస్పీ మాట్లాడుతూ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలన్నారు. అర్జీలను చట్ట పరిధిలో వేగవంతంగా విచారించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. అర్జీదారుల సమస్యను పరిష్కరించడానికి తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, పి.జి.ఆర్.ఎస్ సెల్ ఎస్‌ఐ ఏ.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ
57 మంది బాధితుల నుంచి
అర్జీల స్వీకరణ