
హోరాహోరీగా సాఫ్ట్‌బాల్ పోటీలు
సత్తెనపల్లి: సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల సమీపంలోని లయోలా ఇంజినీరింగ్ కళాశాలలో 12వ అంతరాష్ట్ర స్థాయి మహిళల సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పోటీలు ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 12 సీనియర్ సాఫ్ట్‌బాల్ మహిళల జట్లు హాజరయ్యా యి. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు నిర్వహించారు. మహిళల సాఫ్ట్‌బాల్ పోటీల్లో పోటీపడిన జట్లలో గెలుపొందిన జట్లు వరుసగా ... శ్రీకాకుళం–ప్రకాశం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 10–0తో శ్రీకాకుళం, కర్నూలు–కృష్ణ 1–2తో కృష్ణా, గుంటూరు–ఈస్ట్ గోదావరి 10–0 తో గుంటూరు, అనంతపురం – వైఎస్సార్ కడప 3–4తో వైఎస్సార్ కడప, విజయనగరం–శ్రీకాకుళం 9–3తో విజయనగరం, కర్నూలు–చిత్తూరు 9–8తో కర్నూలు, గుంటూరు–విశాఖపట్నం 10–0తో గుంటూరు, అనంతపురం–నెల్లూరు 11–1 తో అనంతపురం, విజయనగరం–ప్రకాశం 10–0తో విజయనగరం, కృష్ణ–చిత్తూరు 8–1తో కృష్ణా, ఈస్ట్ గోదావరి–విశాఖపట్నం 3–2తో ఈస్ట్ గోదావరి, వైఎస్సార్ కడప – నెల్లూరు 5–2 జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వైఎస్సార్ కడప జట్లు గెలుపొందాయి.
క్వార్టర్ ఫైనల్ పోటీల్లో ...
వైఎస్సార్ కడప – కర్నూలు మధ్య జరిగిన మ్యాచ్‌లో 10–0తో వైఎస్సార్ కడప, కృష్ణ–అనంతపురం 3–2తో కృష్ణా, గుంటూరు – శ్రీకాకుళం 6–2తో గుంటూరు, విజయనగరం – ఈస్ట్ గోదావరి 10–0తో విజయనగరం గెలుపొందాయి. వైఎస్సార్ కడప, కృష్ణా, గుంటూరు, విజయ నగరం జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. ఆదివారం సెమీ ఫైనల్స్‌లో మొదటిగా వైఎస్సార్ కడప – గుంటూరు, రెండవదిగా కృష్ణ – విజయనగరం జట్లు పోటీపడనున్నాయి.
– ప్రారంభ కార్యక్రమంలో డీఎన్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ దరువురి నాగేశ్వరరావు, రిటైర్డ్ పీడీ దాసరి కోటేశ్వరరావు, లయోలా ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ వంశీకృష్ణారెడ్డి, చైర్మన్ రాజారెడ్డి, సెక్రటరీ సామంతరెడ్డి, ట్రెజరర్ జనార్దన్ యాదవ్, ఏపీ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పుణ్యాల నరసింహారెడ్డి, కన్వీనర్ ఎంవీ రమణ, క్రీడాకారిణిలు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.