
చురుగ్గా రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ
మంత్రి నాదెండ్ల మనోహర్
అత్తోట(కొల్లిపర):రాష్ట్రంలో రేషన్ స్మార్ట్ కార్డు ల పంపిణీ చురుగ్గా కొనసాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. మంగళవారం గుంటూరు జిల్లా అత్తోటలో ఆయన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 1.46 కోట్ల మందికి స్మార్ట్ కార్డ్‌లు అందిస్తున్నట్లు చెప్పారు. చౌక దుకాణాల ద్వారా 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ సరుకు లు అందిస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చని చెప్పారు. చౌక దుకాణాలను రానున్న రోజుల్లో మినీమార్ట్‌లుగా తీర్చిదిద్దుతామన్నారు. వీటి ద్వారా తక్కువ ధరకే ఆర్గానిక్, నిత్యావసర సరుకులు అందిస్తామని చెప్పారు. రైతుల నుంచి ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామన్నారు. త్వరలో సబ్సిడీపై టార్ఫలిన్ పట్టాలు అందిస్తామన్నారు.
యూరియా అందడం లేదని రైతుల ఫిర్యాదు
తమకు యూరియా అందడం లేదని అత్తోట గ్రామ రైతులు మంత్రి నాదెండ్లకు ఫిర్యాదు చేశారు.