
బకాయిల వివరాలు తెలియజేయాలి
బాపట్ల అర్బన్: ఉద్యోగులు, పెన్షర్లకు చెల్లించాల్సిన బకాయిల వివరాలు వెంటనే తెలియజేయాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సీహెచ్ సురేష్‌బాబు పేర్కొన్నారు. స్థానిక అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా కనీసం పీఆర్సీ కమిషన్ నియమించలేకపోవటం బాధాకరమన్నారు. ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను చేరవేసే ఉద్యోగుల గురించి ప్రభుత్వం ఆలోచించకపోవడం విచారకరమన్నారు. ప్రతి ఉద్యోగి రెండు సంవత్సరాలుగా తన ఆర్థిక ప్రయోజనాన్ని కోల్పోతున్నారని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలలో కనీసం రెండు డీఏలు అయినా వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఇంతవరకు ఐఆర్ ప్రకటించకపోవటం విచారకరమన్నారు. అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ఓంకార్, జిల్లా కమిటీ సభ్యు లు ఉపాధ్యక్షులు ఎస్.మాధవి, బి.వెంకటేశ్వర్లు, ఓ నెహ్రుబాబు, సిటీ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు మహబూబ్‌బాషా, సుమంత్‌రాజ్, బాపట్ల రెవెన్యూ డివిజన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు పి.బ్రహ్మ య్య, విష్ణు ప్రసాద్, చీరాల డివిజన్ కార్యదర్శి పి.సురేష్, రేపల్లె డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు టి.చంద్రశేఖర్, కె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు