
జిల్లా కోర్టులో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా కోర్టులో వైఎస్సార్ సీపీ జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అల్పాహార విందును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పాల్గొని మహానేత చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు సిడి భగవాన్, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి పోలూరి వెంకటరెడ్డి, మాజీ గవర్నమెంట్ ప్లీడర్లు పోకల వెంకటేశ్వర్లు, ఎంవీ సుబ్బారెడ్డి, మాజీ ఏజీపీ సౌభాగ్య లక్ష్మి, మాజీ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, కాసు వెంకటరెడ్డి, వాసం సూరిబాబు, వజ్రాల రాజశేఖర్ రెడ్డి, మాతంగి శ్రీకాంత్, కేవీ రమణారెడ్డి, సోమసాని ఝాన్సీ, బడి మంజుల, గేర వెంకట సుబ్బారావు, బొడ్డు కోటేశ్వరరావు, బూదాటి సాగర్, లీగల్ సెల్ అధికార ప్రతినిధి సయ్యద్ బాబు, మాజీ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సుధాకర్ రెడ్డి, న్యాయవాదులు కృష్ణారెడ్డి, సుదర్శన క్రాంతి కుమార్ బొమ్మనబోయిన శ్రీనివాస్, నల్లక వెంకట వేణు, సురేష్, నగర యువజన విభాగం అధ్యక్షుడు ఏటి కోటేశ్వరరావు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.