
చికిత్స పొందుతూ మహిళా కూలీ మృతి
బల్లికురవ: పొట్ట కూటి కోసం సుబాబుల్ కర్ర కొట్టి ట్రాక్టర్‌కు లోడ్ చేస్తుండగా వెనుక నుంచి గ్రానైట్ లారీ ఢీకొన్న ఘటనలో మహిళ కూలీ జొన్నలగడ్డ మేరమ్మ (53) మృతి చెందింది. శుక్రవారం రాత్రి బల్లికురవ–సంతమాగులూరు ఆర్‌అండ్‌బీ రోడ్డులోని కొత్తమల్లాయపాలెం బస్టాప్ సమీపంలో ప్రమాదం జరిగిన విషయం పాఠకులకు విదితమే. బల్లికురవ ఎస్సీ కాలనీకి చెందిన జొన్నలగడ్డ మీరమ్మ(53) పందిరి చిన సుబ్బయ్య, కొత్తపల్లి యేసమ్మ, గంధం మీరమ్మ, కొత్తపల్లి చినకోటి, పందిరి సుబ్బారావు సుబాబుల్ కర్రకొట్టి ట్రాక్టర్‌కు రోడ్ మార్జిన్‌లో లోడింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో పాతమల్లాయపాలెం గ్రామానికి చెందిన గ్రానైట్ లారీ ఈర్ల కొండకు వద్దకు వెళుతూ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. కొత్తపల్లి చినకోటి, పందిరి సుబ్బారావు మినహా మగిలిన నలుగురు గాయాల పాలయ్యారు. నరసరావుపేటలో చికిత్స పొందుతూ మీరమ్మ మృతి చెందింది. కూలీ కొత్తపల్లి యేసమ్మ ఫిర్యాదు మేరకు బల్లికురవ ఎస్సై వై.నాగరాజు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం తదుపరి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలికి భర్త ఇరువురు కుమారులున్నారు. బల్లికురవ ఎస్సీలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి.