
మధ్యాహ్న భోజనం పరిశీలన
యాజలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమలు జరుగుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థులతో కలసి కలెక్టర్ భోజనం చేశారు. భవిష్యత్‌లో ఏం కావాలనుకుంటున్నారని కలెక్టర్ విద్యార్థులను ప్రశ్నించారు. ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదివి కలలు నెరవేర్చుకోవాలని ఆయన చెప్పారు.
అధికారులపై అసహనం
యాజలి గ్రామంలో జరుగుతున్న స్వామిత్వ సర్వేను పరిశీలించిన కలెక్టర్ క్షేత్రస్ధాయిలో పనిచేసే సర్వే సిబ్బంది పనితీరు సరిగా లేదని అధికారుల మధ్య సమన్వయం లేకపోతే ఎలా అని అసహనం వ్యక్తం చేశారు. కర్లపాలెం పంచాయతీ పరిఽధిలోని ఎంవిరాజుపాలెంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఫ్రీ స్కూల్ నిర్వహణపై ఆరా తీశారు. చిన్నారులందరికీ పౌష్టికాహరం సక్రమంగా అందించాలని చెప్పారు. అడిగిన ప్రశ్నలకు చిన్నారులు సరిగా స్పందించకపోటంతో కలెక్టర్ కార్యకర్తపై అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమాలలో బాపట్ల ఆర్డీవో పి.గ్లోరియా, వ్యవసాయశాఖ ఏడీ అన్నపూర్ణ, డీపీవో ప్రభాకర్‌రావు, మార్క్‌ఫెడ్ ఏడీ కరుణశ్రీ, సీడీపీవో రాధామాధవి, డీఎంఅండ్ హెచ్‌వో విజయమ్మ, తహసీల్దార్ షాకీర్ పాషా, ఇన్‌చార్జి ఎంపీడీవో అయినంపూడి శ్రీనివాసరావు, ట్రైనింగ్ ఎస్‌ఐ నజీమా తదితరులు ఉన్నారు.