
జాతీయస్థాయి వాటర్‌రేస్ పోటీల్లో ద్వితీయ స్థానం
నగరం: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కళాశాల కరస్పాడెంట్ వల్లభనేని బుచ్చియ్యచౌదరి చెప్పారు. స్థానిక ఎస్వీఆర్‌ఎం కళాశాలలో సోమవారం వాటర్‌రేస్‌లో జాతీయస్థాయిలో ద్వితీయ స్థానం సాధించిన పాగిడి గాయత్రికి అభినందన సభ నిర్వహించారు. బుచ్చియ్యచౌదరి మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్‌లో ఈనెల 21 నుంచి 23 వరకు జరిగిన వాటర్ రేస్ పోటీల్లో గాయత్రి ప్రతిభ కనబర్చి ద్వితీయ స్థానం సాధించిందన్నారు. కృషి, పట్టుదల, అంకిత భావంతో పనిచేస్తే విజయాలు సుళువుగా సాధించవచ్చునన్నారు. అనంతరం గాయత్రిని కళాశాల పాలకవర్గ సభ్యులు, అధ్యాపకేతర సిబ్బంది ఘనంగా సన్మానించారు. ప్రిన్సిపాల్ అనగాని హరికృష్ణ, వ్యాయామ ఉపాధ్యాయుడు సాంబమూర్తి పాల్గొన్నారు.