
‘బార్’లకు నేటితో ముగియనున్న గడువు
రేపల్లె: ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన బార్ పాలసీలో భాగంగా బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వహణ అనుమతులు పొందేందుకు నేడు 26వ తేదీ సాయంత్రం 5 గంటలకు దరఖాస్తు గడువు ముగుస్తున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ కె.విజయ తెలియజేశారు. స్థానిక ప్రొహిబిషన్ కార్యాలయంలో సోమవారం రెస్టారెంట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపే వారితో సమావేశం నిర్వహించారు. మూడు సంవత్సరాల పాటు బార్ అండ్ రెస్టారెంట్ నడుపుకొనేందుకు అనుమతులు లభిస్తాయన్నారు. రేపల్లెలో నాలుగు బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటుకు అనుమతులు లభించాయన్నారు. 2025 అక్టోబర్ 1 నుంచి 2028 ఆగస్టు 31వ తేదీవరకు మూడు సంవత్సరాల పాటు బార్ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందన్నారు. దరఖాస్తులు చేసుకునేవారు రూ.5 లక్షలు నాన్ రిఫండబుల్ ఫీజు, రూ 10,000 అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని తెలియజేశారు. బార్లకు అందిన దరఖాస్తులను ఈ నెల 28వ తేదీ ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ సమక్షంలో బాపట్లలో లాటరీ విధానంలో ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. బార్ పాలసీ విధి విధానాలను తెలియజేశారు. సమావేశంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ దివాకర్ పాల్గొన్నారు.
చీరాల అర్బన్: రెస్టారెంట్ అండ్ బార్‌ల నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిందని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కె.హేమంత నాగరాజు తెలిపారు. నోటిఫికేషన్‌ను అనుసరించి సోమవారం స్థానిక ఎకై ్సజ్ స్టేషన్‌లో ఔత్సాహికులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి మద్యం షాపుల యజమానులు, రియల్ ఎస్టేట్, రిసార్ట్స్ నిర్వాహకులు, బెల్లం అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు. హాజరైన వారితో ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌పై మాట్లాడారు. ఆసక్తి ఉన్న వారు టెండర్లు వేయాలని, లాటరీ పద్ధతిలో ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. రెస్టారెంట్ అండ్ బార్‌ల కోసం దరఖాస్తులు ఔత్సాహికులు ప్రతి ఒక్కరూ వేయాలన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ సీఐ పి.నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్
అసిస్టెంట్ కమిషనర్ కె.విజయ