
బెల్టు షాపులను ప్రోత్సహిస్తే చర్యలు
వేమూరు: బెల్టు షాపులను ప్రోత్సహించే మద్యం షాపు నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని ఒంగోలు ప్రొహిబిషన్, ఎకై ్సజ్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారి విజయ తెలిపారు. మండల కేంద్రంలోని ప్రొహిబిషన్ ఎకై ్సజ్ కార్యాలయంలో నమోదైన మద్యం కేసులను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మద్యం షాపుల నిర్వాహకులు ప్రభుత్వం నిబంధనల ప్రకారం విక్రయాలు చేయాలన్నారు. ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటి వరకు నమోదైన మద్యం కేసులు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రొహిబిషన్ ఎకై ్సజ్ సీఐ రవి కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
28న నిధి ఆప్‌కే నికత్
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరులోని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్) ప్రాంతీయ కార్యాలయ ఆధ్వర్యంలో ఈనెల 28న నిధి ఆప్‌కే నికత్ కార్యక్రమాన్ని ఆరు జిల్లాల్లో నిర్వహిస్తున్నట్లు సహాయ పీఎఫ్ కమిషనర్ పి.గోపాల్‌సింగ్ సోమవారం ఓప్రకటనలో తెలిపారు. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఉదయం 9.30 గంటల నుంచి జరగనున్న సమావేశాల్లో యజమానులు, ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు ఇతర వాటాదారులు, లబ్ధిదారులతో పరస్పరం ముఖా ముఖిగా చర్చలు జరుగుతాయని తెలిపారు. గుంటూరు అరండల్‌పేటలోని సెయింట్ ఇగ్నేషియస్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల, ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని పెర్ల్ డిస్టలరీస్, బాపట్లలోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్, సత్తెనపల్లిలోని శ్రీరాఘవేంద్ర బాలకుటీర్‌లో నిర్వహించనున్న నిధి ఆప్‌కే నికత్‌లో పాల్గొని ఫిర్యాదులు, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.