బాపట్ల: కూటమి ప్రభుత్వం బీసీల జోలికివస్తే తగ్గిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని వైఎస్సార్ సీపీ బీసీసెల్ జిల్లా అధ్యక్షులు గవిని శ్రీనివాసరావు హెచ్చరించారు. పులివెందులలో టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌పై దాడిని ఖండిస్తూ పార్టీ బీసీ నాయకుల ఆధ్వర్యంలో స్థానిక చీలురోడ్డు సెంటర్‌లోని జ్యోతిరావుపూలే విగ్రహం వద్ద నిరసన ధర్నా చేపట్టారు. గవిని శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్దేశపూర్వకంగానే బీసీ నాయకుడుపై దాడి చేయించారని అన్నారు. బీసీ ఓట్లతో గెలుపొందిన కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి మరీ బీసీలపై దాడులు చేయటం సరికాదన్నారు. భవిష్యత్‌లో బీసీలపై దాడులు జరిగితే ఓట్ల ద్వారా సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యువజనవిభాగం జిల్లా అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య, దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు చల్లా రామయ్య, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు వాసుమల్ల వాసు, బాపట్ల నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు పీటా వేణుగోపాల్, నాయకులు శాయిలమురళి, జిల్లా మున్సిపాలిటీ అధ్యక్షులు బత్తుల అనీల్, బీసీ నేతలు పిన్ని బోయిన ప్రసాద్ యాదవ్, తన్నీరు వెంకట్రావు, నర్రావుల వెంకట్రావు, పులి శ్రీను, బాపట్ల పట్టణ వైసీపీ యువజన అధ్యక్షులు ఊరబండి గోపీనాథ్, నక్కల పవన్ కుమార్, పాలపర్తి గోపి, జమ్ములపాలెం మాజీ సర్పంచ్ కటికల యోహోషువా తదితరులు ఉన్నారు.
వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గవిని శ్రీనివాసరావు పూలే విగ్రహం వద్ద నేతల నిరసన