
అక్రమ పేలుళ్లు
బుధవారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2025
గ్రానైట్ క్వారీల్లో
బిల్లులు లేకుండానే యథేచ్ఛగా ఎక్స్‌ఫ్లోజర్స్ విక్రయం
పొంచి ఉన్న ప్రమాదం
హైదరాబాద్, నాగపూ ర్, చైన్నై ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పేలుడు పదార్థాలను అనధికారికంగా గ్రానైట్ క్వారీల్లో పేలుళ్ల కోసం విక్రయిస్తున్నారు. ఇది ప్రమాదమని తెలిసినా వ్యాపారులు ఖాతరు చేయడంలేదు. పేలుడు పదార్థాల విక్రయాలకు నియంత్రణ అవసరం. అనధికారికంగా కాకుండా అధికారిక (బిల్లులతో) విక్రయాలు మాత్రమే జరిగేలా చూడాలే తప్ప ఎక్స్‌ఫ్లోజర్స్ వినియోగానికి మినహాయింపులు ఉండకూడదు. అధికారుల నిఘా మధ్య ఎక్స్‌ఫ్లోజర్స్ వినియోగం వుండాలి. ఇప్పటికై నా మైనింగ్‌తోపాటు జిల్లా ఉన్నతాధికారులు పేలుడు పదార్థాల వినియోగంపై దృష్టి పెట్టి అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలకు దిగాలి.
సాక్షి ప్రతినిధి,బాపట్ల: పేలుడు పదార్థాలు జిల్లాకు పెద్దఎత్తున తరలి వస్తున్నాయి. వాటిలో చాలా వరకు ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమ పద్ధతిలో దిగుమతి అవుతున్నాయి. బల్లికురవ, సంతమాగులూరు, గురిజేపల్లి ప్రాంతాల్లోని గ్రానైట్ క్వారీల్లో పేలుళ్ల కోసం వీటిని వినియోగిస్తున్నారు. ఈ పేలుడు పదార్థాలను హైదరాబాద్‌లోని కొన్ని ఎక్స్‌ఫ్లోజర్స్ కంపెనీల నుంచే కాకుండా నాగపూర్, చైన్నైల నుంచి ఇక్కడికి తరలిస్తున్నారు. చీమకుర్తి, బల్లికురవ ప్రాంతాలకు చెందిన కొందరు లైసెన్స్ హోల్డర్లు అక్రమ పద్ధతిలో ఎక్స్‌ఫ్లోజర్స్‌ను దిగుమతి చేసుకొని ఈ ప్రాంతంలోని క్వారీల యజమానులకు విక్రయిస్తున్నారు. బిల్లులు లేకుండా ఎక్స్‌ఫ్లోజర్స్ దొరుకుతుండడంతో క్వారీ యజమానులు వీలైనంత ఎక్కువగా పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం బల్లికురవ మండలం కొనెదన రెవెన్యూ పరిధిలోని సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో ప్రమాదం సంభవించి పలువురు ఒడిశాకు చెందిన కార్మికులు మృతి చెందిన నేపథ్యంలో గ్రానైట్ క్వారీల్లో ప్రమాదాలపై మరోమారు చర్చ సాగుతోంది. పేలుడు, డ్రిల్లింగ్‌ల సందర్భంలో క్వారీల్లో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అయితే క్వారీ యజమానులు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
చీమకుర్తి కేంద్రంగా అక్రమ వ్యాపారం
చీమకుర్తి కేంద్రంగా పేలుడు పదార్థాల వ్యాపారం నడిపిస్తున్న త్రినాథరావుకి 21తోపాటు 22 (లీజుకు తీసుకున్నది) లైసెన్స్‌లు ఉండగా ఈయన మొత్తం ఎక్స్‌ఫ్లోజర్స్ మూడు జిల్లాల్లో వ్యాపారానికి కింగ్ పిన్‌గా ఉన్నారు. ఈ వ్యక్తి చీమకుర్తి ప్రాంతంలో గోదాములు ఏర్పాటు చేసుకొని బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు బిల్లులు లేకుండానే పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్నారు. కొందరు ఎక్స్‌ఫ్లోజర్స్ లైసెన్స్‌దారులు ఈ వ్యక్తి పేరు మీదనే ఇండెంట్ పెట్టుకుని పేలుడు పదార్థాలు తెప్పించుకుంటున్నారు. ఈ వ్యాపారి సరఫరా చేసే ఎక్స్‌ఫ్లోజర్స్‌లో 80 శాతం వాటికి బిల్లులు లేకుండా విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం.
పచ్చపార్టీ నేతల అండదండలతో...
బల్లికురవ ప్రాంతం నాగరాజుపల్లెకు చెందిన హరిప్రసాద్‌బాబు గంగపాలెం ప్రాంతంలో గోదాము ఏర్పాటుచేసి అక్రమ ఎక్స్‌ఫ్లోజర్స్ విక్రయిస్తున్నారు. సదరు వ్యాపారికి చీమకుర్తి, బల్లికురవ ప్రాంతాల్లో గోదాములు ఉండగా నెల్లూరు కేంద్రంగా కూడా వ్యాపారం సాగిస్తున్నట్లు సమాచారం. ఇదే గ్రామానికి చెందిన రాజేష్‌కుమార్ 20 వరకూ క్వారీలతోపాటు 18 టన్నుల గోదాములతో ఎక్స్‌ఫ్లోజర్స్‌ను పెద్దఎత్తున విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. మార్టూరుకు చెందిన మల్లి వలపర్ల ప్రాంతంలో గోదాము ఏర్పాటు చేసుకొని పేలుడు పదార్థాలు అక్రమంగా విక్రయిస్తున్నాడు. రామాంజిపురానికి చెందిన హనుమంతు రామాంజిపురం ప్రాంతంలో 4 టన్నుల గోదాము, నాగరాజుపల్లి ప్రాంతంలో మూడు టన్నుల గోదాము ఏర్పాటు చేసి పేలుడు పదార్థాల వ్యాపారం సాగిస్తున్నట్లు సమాచారం. ఇక్కడి పేలుడు పదార్థాల లైసెన్స్‌దారులు చాలామంది పచ్చపార్టీ అండతో అక్రమ పద్ధతిలోనే విక్రయాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. వీరంతా దాదాపు డీ గార్డ్, దీ ఎఫ్, కేబుల్, వైరులో పొడి, తూటా(జల్‌బాక్స్) 180, 200 మాటర్లు, బూస్టర్లు, ఈడీ(జిలెటిన్ స్టిక్స్), ఓడీ తదితర పేలుడు పదార్థాలను క్వారీలలో పేలుళ్ల కోసం విక్రయిస్తున్నారు. ఎక్స్‌ఫ్లోజర్స్‌ను హైదరాబాద్, నాగపూర్, చైన్నై ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. కొందరు వ్యాపారులు నిషేధిత పేలుడు పదార్థాలను సైతం తెచ్చి విక్రయిస్తున్నట్లు సమాచారం.
వ్యాపారులకు అధికారులు అండ
కూటమి ప్రభుత్వం అధికారంలోని వచ్చాక క్వారీ ల్లోని పేలుళ్లు, పేలుడు పదార్థాల విక్రయాలు, వినియోగాన్ని అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. క్వారీ యజమానులతోపాటు పేలుడు పదార్థాల విక్రయదారులు దాదాపుగా పచ్చపార్టీ నేత లు, మద్దతుదారులే కావడం, కొందరు మైనింగ్, పోలీసు, విజిలెన్స్, ఫైర్ అధికారులు వారి వద్ద నెల మామూళ్లు పుచ్చుకొని పేలుడు పదార్థాల గురించి పట్టించుకోవడంలేదు. వ్యాపారులు చూపిన రికార్డులపై గుడ్డిగా సంతకాలు పెడుతున్నారు.
న్యూస్‌రీల్
పచ్చనేతల కనుసన్నల్లో లైసెన్స్ హోల్డర్ల అక్రమ వ్యాపారాలు
భద్రతను పట్టించుకోని వైనం
కూటమి పాలనలో కానరాని తనిఖీలు
నెల మామూళ్లతో సరిపెట్టుకుంటున్న అధికారులు
హైదరాబాద్, నాగపూర్ నుంచి పేలుడు పదార్థాల దిగుమతి

అక్రమ పేలుళ్లు

అక్రమ పేలుళ్లు

అక్రమ పేలుళ్లు