
నగరంలో ట్రాక్టర్ బీభత్సం
● మహిళపై నుంచి వెళ్లిన ట్రాక్టర్ ● మద్యం మత్తులో నడపడం వల్లే ప్రమాదం ● నలుగురికి గాయాలు ● మహిళ పరిస్థితి విషమం
నగరం నగరం మెయిన్ సెంటర్‌లో మంగళవారం సాయంత్రం ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. నగరం గ్రామానికి చెందిన తాడివాక జయప్రద (45)రోడ్డుపై వెళుతున్న సమయంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ (ఏపీ 27 టీ 7895) అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో జయప్రద ఎగిరి కిందపడింది. ఆమైపె నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో తీవ్ర గాయాలపాలైంది. అంతంటితో ఆగకుండా ఎదురుగా ఉన్న బజ్జీల బండిని ఢీ కొంది. దీంతో బండి చెల్లాచెదురుగా పడింది. అనంతరం పక్కనే ఉన్న గోడను ఢీకొట్టి ట్రాక్టర్ ఆగింది. ఈ ఘటనలో బజ్జీ బండి నిర్వాహకుడు గాయాలపాలయ్యారు. వీరితోపాటు ట్రాక్టర్ డ్రైవర్‌కు కాలు విరిగింది. ట్రాక్టర్ పైన ఉన్న మరో వ్యక్తికి గాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన జయప్రదను స్థానికులు ప్రభుత్వ వైద్యశాల తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. ఘటనపై ఎస్‌ఐ భార్గవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మద్యం మత్తులో ట్రాక్టర్ నడపడం వల్ల ప్రమాదం సంభవించిందని స్థానికులు వెల్లడించారు.

నగరంలో ట్రాక్టర్ బీభత్సం

నగరంలో ట్రాక్టర్ బీభత్సం