
శుభకరం.. శ్రావణం
మెండుగా మహుర్తాలు..
శ్రావణ మాసం సకల శుభకరం. ఈ నెలలో వ్రతాలు, పండుగలు ఉన్నాయి. ఈ నెలలో ముహుర్తాలు కూడా దివ్యంగా ఉన్నాయి. శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం. శ్రావణ శుక్రవారం, మంగళగౌరీ వ్రతాలను మహిళలు ఆచరిస్తారు.
– స్వర్ణరాంబాబు శర్మ,
పురోహితుడు, చెన్నుపల్లి
అద్దంకి: వివాహాది శుభముహుర్తాలకు, పండుగలకు, వరలక్ష్మి వ్రతాలకు శ్రావణ మాసం శుభసూచికం. ఈ నెల 26 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుండగా.. మెండుగా శుభ ముహుర్తాలు ఉన్నాయి. ఈక్రమంలో వస్త్ర, నగలు, కిరాణాతో పాటు వివిధ రకాల వ్యాపారాలు కళకళలాడనున్నాయి. క్యాటరింగ్, ఆర్క్రెష్ట్రా, బ్యాండ్ బాజాలు, డీజేలకు గిరాకీ పెరగనుంది. కల్యాణ మండపాలు ఇప్పటికే బుక్ అవ్వడం గమనార్హం.
శ్రావణం అంటే..
శ్రావణమాసానికి నభో మాసం అనే పేరు కూడా ఉంది. ఆరోగ్యదాయకమైన మాసం అని అర్ధమని పండితులు చెబుతారు. చంద్రుడు శ్రవణా నక్షత్రంతో కలిసిన నెలను శ్రావణ మాసం అంటారు. శ్రావణ మాసం విశిష్టత గురించి స్కంధ పురాణంలో రాయబడింది.
పండుగలు
కృష్ణ జన్మాష్టమి, రక్షాబంధన్, నార్యల్ పూర్ణిమ, నాగపంచమి, బసవ పంచమి, అవని అవిట్టం, బలరామ జయంతి, గంగా పూర్ణిమ, కజారి పూర్ణిమి, పవిత్రోపన, పవిత్ర ఏకాదశి, జంధ్యాల పూర్ణిమ, సలోనో, పోలా, శ్రావణిమేళా, హయగ్రీవ జయంతి, తదితర పండుగలతోపాటు, శ్రావణ శుక్రవారవ్రతాలు, విశిష్టమైన వరలక్ష్మి వ్రతం పండుగలు ఉన్నాయి.
ఆధ్యాత్మికతకు ఆలవాలం ఈ నెల 26 నుంచి శ్రావణమాసం ఆరంభం మెండుగా శుభ ముహుర్తాలు కళకళలాడనున్న కల్యాణ వేదికలు, వ్యాపారాలు
మంచి ముహుర్తాలు..
శ్రావణ మాసం మొదలైన మొదటి రోజు నుంచి ముహర్తాలు మొదలు కానున్నాయి. ముఖ్యంగా జూలై నెలలో 26, 30, 31, ఆగస్టులో 1,3,5,6,7, 8, 9, 12, 13, 14, 17, అక్టోబరులో 1, 2, 3, 4, 7, 8, 10, 11, 12, 16,17, 22, 23, 24, 26, 28, 29, 30, 31, నవంబరు నెలలో 1,2,4,7, 12, 13, 14,15, 22, 123, 25, 26, 27 తేదీల్లో ముహుర్తాలు ఉన్నాయని పురోహితులు చెప్తున్నారు.

శుభకరం.. శ్రావణం