
పిడుగుపాటుకు ఇద్దరు మృతి
భట్టిప్రోలు: పిడుగుపాటుకు గురై బాపట్ల జిల్లాలో గురువారం ఇద్దరు మృతి చెందారు. భట్టిప్రోలు మండలం ఓలేరు శివారు వెంకటరాజు నగర్‌కు చెందిన గుంటూరు లూదు మరియన్న (70) పొలంలో పనిచేస్తుండగా గురువారం మధ్యాహ్నం అకస్మాత్తుగా వర్షం ఆరంభమైంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండటంతో సమీపంలో ఉన్న వేప చెట్టు కిందకు వెళ్లి తలదాచుకున్నాడు. అదే సమయంలో అతడికి అత్యంత సమీపంలో పిడుగు పడింది. పిడుగు ధాటికి గురై మృతి చెందాడు. గమనించిన స్థానికులు వృద్ధుడు మృతిచెందిన విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. మృతుడికి భార్య, ఇరువురు సంతానం ఉన్నారు.
మహిళ మృతి
సంతమాగులూరు(అద్దంకి): పిడుగు పాటుకు మహిళ మృతిచెందగా మరొకరికి గాయాలైన సంఘటన మండలంలోని ఏల్చూరు గ్రామంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన వారు పొలాల్లో గేదెలు మేపుతుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆ సమయంలో పిడుగు ధాటికి పద్మ మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. గాయడిన వ్యక్తిని వైద్యశాలకు తరలించారు.

పిడుగుపాటుకు ఇద్దరు మృతి