
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు స్వీకరణ
నెహ్రూనగర్: సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్ 2024–25 పోటీల్లో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థకు ప్రతిష్టాత్మక అవార్డు లభించడం ఆనందంగా ఉందని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర పురపాలక మంత్రి నారాయణ, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ కె.పట్టాభిరాం, నగర మేయర్ కోవెలమూడి రవీంద్రలు అవార్డును స్వీకరించారు. భవిష్యత్తులో గుంటూరు నగరాన్ని దేశంలోనే క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.