
బగళాముఖి ఆలయ హుండీ ఆదాయం రూ.6,09,886
కర్లపాలెం: చందోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయ హుండీ ఆదాయం రూ.6,09,886 వచ్చినట్లు ఆలయ ఈవో జి.నరసింహమూర్తి తెలిపారు. గురువారం బాపట్ల డివిజన్ దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ ఎం.గోపి, చందోలు ఎస్‌ఐ ఎంవి శివకుమార్‌యాదవ్ పర్యవేక్షణలో పొన్నూరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజర్ నాగరాజు ఆధ్వర్యంలో బ్యాంకు సిబ్బందితోపాటు అమ్మవారి భక్తులు హుండీ నగదు లెక్కించారు. ప్రతి మూడు నెలలకు అమ్మవారి హుండీ నగదు లెక్కిస్తున్నామని గతంకంటే అమ్మవారి హుండీ ఆదాయం ఎక్కువగా ఉందని ఈవో తెలిపారు.
వైభవంగా పవిత్రోత్సవాలు
పెదకాకాని: శివాలయంలో ప్రారంభమైన పవిత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానములో మూడు రోజుల పవిత్రోత్సవాల్లో భాగంగా రెండవ రోజు గురువారం అర్చకులు, వేదపండితులు పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్, స్థానాచార్యులు పొత్తూరి సాంబశివరావు పర్యవేక్షణలో ఇవి జరిగాయి. ఈ పవిత్రోత్సవాల్లో చివరిరోజు శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని ఆలయ డీసీ గోగినేని లీలాకుమార్ తెలిపారు. ఉదయం అన్నదానం, సాయంత్రం ప్రత్యేక వాహనంపై స్వామి వారి గ్రామోత్సవం జరుగుతుందన్నారు. పూజా కార్యక్రమాల్లో ప్రధాన అర్చకులు పొత్తూరి లక్ష్మీనారాయణ వరప్రసాదు, అర్చకులు, దాతలు, భక్తులు పాల్గొన్నారు.
గిరిజా కల్యాణం
పోస్టర్ ఆవిష్కరణ
నగరంపాలెం: స్థానిక ఆర్.అగ్రహారం శ్రీకన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గురువారం గిరిజా కళ్యాణ పోస్టర్‌ను వైశ్యకుల గురువు వామనాశ్రమ మహా స్వామీజీ ఆవిష్కరించారు. ఈ నెల పది నుంచి సెప్టెంబర్ ఏడో తేదీ వరకు చాతుర్మాస దీక్షలో భాగంగా 27న గిరిజా కల్యాణం నిర్వహిస్తున్నట్లు చాతుర్మాస సేవా సమితి కన్వీనర్ తటవర్తి రాంబాబు తెలిపారు. కల్యాణంలో పాల్గొనేందుకు 94406 05773 నంబర్‌లో సంప్రదించాలని అన్నారు. ఆవిష్కరణ కార్యక్రమంలో గుడివాడ రవి, జుజ్జూరు శ్రీనివాసరావు, బాపారావు, కోటా శేషగిరి, మహంకాళి శ్రీనివాసరావు, సునీత, త్రిపురమల్లు వాణి పాల్గొన్నారు.
వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు నిలుపుదల
రూ.85.52 విలువైన ఉత్పత్తులపై
అధికారుల చర్యలు
కొరిటెపాడు: జిల్లాలోని గుంటూరు నగరం, తెనాలి, ప్రత్తిపాడులో వ్యవసాయ శాఖ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. గురువారం విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల తయారీదారులు, టోకు వర్తకులు, రిటైల్ దుకాణాల్లో రెండు బృందాలుగా సోదాలు చేశారు. ఎనిమిది దుకాణాల్లో రూ.57.11 లక్షల విలువైన 318.67 టన్నుల ఎరువులు, 11 దుకాణాల్లో రూ.19.83 లక్షల ఖరీదు చేసే 6,630 లీటర్ల పురుగు మందులు, ఐదు దుకాణాల్లో రూ.8.58 లక్షల విలువైన 1,278 మెట్రిక్ టన్నుల విత్తనాల విక్రయాలను నిలుపుదల చేశారు. తనిఖీల్లో గుంటూరు వ్యవసాయాధికారి ఎ.నాగేశ్వరరావు, ఏడీఏలు పి.మురళీకృష్ణ (పశ్చిమ గోదావరి), ఎం.సునీల్ (గన్నవరం), విజిలెన్స్ సీఐలు కె.వెంకటేశ్వర్లు, సీహెచ్ రవిబాబు, వ్యవసాయ అధికారులు సునీల్‌కుమార్ (ఒంగోలు), బి.కిషోర్‌కుమార్ (గుంటూరు రూరల్) పాల్గొన్నారు.

బగళాముఖి ఆలయ హుండీ ఆదాయం రూ.6,09,886

బగళాముఖి ఆలయ హుండీ ఆదాయం రూ.6,09,886

బగళాముఖి ఆలయ హుండీ ఆదాయం రూ.6,09,886