
‘వన్ డే యాజ్ ఏ సైంటిస్ట్’కి సాయిరెడ్డి ఎంపిక
పెదకూరపాడు:మండలంలోని 75 త్యాళ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి కె.హెమంత్ సాయిరెడ్డి జాతీయ స్థాయిలో జరిగే అరుదైన ‘వన్ డే యాజ్ ఏ సైంటిస్ట్’ కార్యక్రమానికి ఎంపికై నట్లు హెచ్‌ఎం ఎ.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆన్‌లైన్‌లో నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థి కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఈ ఎంపిక జరిగింది. హేమంత్ సాయిరెడ్డి హైదరాబాదులోని సీఎస్ ఐఆర్ పరిశోధన సంస్థలో ఈ నెల 21న ‘వన్ డే యాజ్ ఎ సైంటిస్ట్’ గా పాల్గొంటాడు. శాస్త్రవేత్తలతో పని చేయడం, వారికి సహాయకుడిగా ఉండడం, ముఖాముఖీ, ప్రయోగాలు, ప్రయోగశాల పర్యటన, జీవ శాస్త్రం, భౌతిక, రసాయన శాస్త్రం, జీవకణ పరిశోధన వంటి అంశాలపై ప్రయోగ అనుభవం పొందడమే కాకుండా ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలతో మమేకం అయ్యే అవకాశం ఉంటుంది. ఇది భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా మారాలనే ప్రేరణనిచ్చే అవకాశం అవుతుంది.