22 ఏలో ఉన్న 102 ఎకరాల భూమికి విముక్తి | - | Sakshi
Sakshi News home page

22 ఏలో ఉన్న 102 ఎకరాల భూమికి విముక్తి

Jul 19 2025 3:46 AM | Updated on Jul 19 2025 3:46 AM

22 ఏలో ఉన్న 102 ఎకరాల భూమికి విముక్తి

22 ఏలో ఉన్న 102 ఎకరాల భూమికి విముక్తి

బాపట్ల అర్బన్‌: దశాబ్దాలుగా 22–ఏలో ఉన్న 102 ఎకరాల భూమికి విముక్తి కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ జె వెంకట మురళి చెప్పారు. నిజాంపట్నం మండలం ముత్తుపల్లి గ్రామంలోని రైతులతో శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులు ఆ భూమిని పోరంబోకు భూమిగా దస్త్రాలలో నమోదు చేశారన్నారు. తప్పుగా నమోదు చేయ డం ద్వారా ఆరు దశాబ్దాలుగా రైతులు ఇబ్బందులు పడుతున్నామని 20 రోజుల కిందట కలెక్టర్‌కు విన్నవించారు. మా భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయని, సమస్యను పరిష్కరించాలని అభ్యర్థించారు. స్పందించిన కలెక్టర్‌ విచారణ జరిపించారు. తదుపరి రైతులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. రెవెన్యూ దస్త్రాలలో తప్పుగా నమోదు చేయడం ద్వారానే ఆ గ్రామ రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించామన్నారు. అప్పట్లో ఉన్న రెవె న్యూ అధికారులు వాటిని సరిచేయక పోవడంతోనే 1987 లో పోరంబో కు భూములుగా దస్త్రాలలో నమోదయ్యిందన్నారు. తదుపరి 22 ఏ నిషేధిత భూముల జాబితాలోకి వెళ్లిపోయిందని తెలిపారు. దశాబ్దాల కిందట దస్త్రాలన్ని క్షుణ్ణంగా పరిశీలించి, విచారించిన తదుపరి ఆ భూములు 87 మంది రైతులవేనని తేలిందన్నారు. ప్రభుత్వంతో చర్చించిన అనంతరం ఆ భూమికి సాగు పట్టా భూమిగా గుర్తించామన్నారు. సాగులో ఉన్న ఆ భూమి యజమానులకు పూర్తిస్థాయిలో యాజ మాన్య హక్కులు కల్పిస్తామని కలెక్టర్‌ తెలిపారు. పాస్‌ పుస్తకాలు ఇస్తామన్నా రు. సమావేశంలో రేపల్లె ఆర్డిఓ రామలక్ష్మి, నిజాంపట్నం తహసీల్దార్‌ ఎం శ్రీనివాసరావు, ముత్తుపల్లి గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాల అమలు...

పనితీరు వేగవంతం చేయాలి

బాపట్ల: రెవెన్యూ శాఖ నిర్వహించే వివిధ ప్రభుత్వ పథకాల అమలు, పనితీరును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు సంబంధించి ఆధార్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేయాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పీ–4 కార్యక్రమంలో బంగారు కుటుంబాలను, మార్గదర్శలను నిర్ధారించడంలో వారి స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. బంగారు కుటుంబా లు, మార్గదర్శకులకు సంబంధించి గ్రామసభ లు ఏర్పాటుచేసి చేర్పులు, తొలగింపులకు చర్య లు తీసుకోవాలన్నారు. ఈనెల 21వ తేదీ లోపు మార్పులు, చేర్పులు పూర్తిచేయాలన్నా రు. కార్యక్రమంలో డీఆర్వో గంగాధర్‌ గౌడ్‌, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ కనకరాజు, సీపీఓ షాలేమ్‌ రాజు, బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీఓలు గ్లోరియా, చంద్రశేఖర్‌, రామలక్ష్మి, బాపట్ల, చీరాల, రేపల్లె డీఎల్‌డీవోలు పాల్గొన్నారు.

పొగాకు నిల్వ చేసేందుకు గోడౌన్ల అన్వేషణ

కొనుగోలు చేసిన పొగాకును నిలువ చేసేందుకు కొత్త గోడౌన్లను అన్వేషించే బాధ్యతను జిల్లా రెవెన్యూ డివిజనల్‌ అధికారులకు, జిల్లా మేనేజర్‌కు అప్పగించినట్లు జిల్లా కలెక్టర్‌ జె.వెంకటమురళి తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి కొనుగోలు కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు కొనుగోలు చేసిన 2529.650 మెట్రిక్‌ టన్నులను బ్లాక్‌ బర్లీ పొగాకును జిల్లా స్థాయి కొనుగోలు కమిటీ సమావేశం ఆమోదించింది. కొనుగోలు చేసిన పొగాకును గోడౌన్లలో కొంతవరకు పెట్టడం జరిగిందన్నారు. మిగిలిన పొగాకును వేరొక పెద్ద గోడౌన్లకు తరలించి ప్రస్తుతం ఉన్న కేంద్రాల్లో పొగాకు కొనుగోలు చేయాలని తీర్మానించినట్లు కలెక్టర్‌ తెలిపారు. బ్లాక్‌ బర్లీ పొగాకును తరలించడానికి టెండర్ల ఆహ్వానం బాధ్యతను జిల్లా మేనేజర్‌కు అప్పగించినట్లు తెలిపారు.

జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement