
అందుబాటులోకి పురమిత్ర యాప్
కమిషనర్ జి.రఘునాథరెడ్డి
బాపట్ల అర్బన్: బాపట్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో పురమిత్ర యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ జి.రఘునాథరెడ్డి తెలిపారు. ఈమేరకు పురమిత్ర యాప్‌ను మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. కమిషనర్ జి.రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఇంట్లో ఉండే అన్ని సేవలను పొందే విధంగా రాష్ట్ర పురపాలక మంత్రిత్వ శాఖ కొత్త యాప్‌ను తీసుకొచ్చిందని, ‘పుర మిత్ర‘ యాప్ ఇక నుంచి ప్రజలకు పౌర సేవలను అందించనుందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్‌న్స్ (ఏఐ) టెక్నాలజీతో రూపొందించిన ఈ యాప్‌లో పలు సేవలు పొందే వీలు ఉంటుందని తెలిపారు.
అద్దంకిలో 62.6
మి.మీ వర్షపాతం
అద్దంకి రూరల్: అద్దంకి శుక్రవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. 62.6 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. పల్లపు ప్రాంతాల్లోని ఇళ్లలో నీరు చేరింది.
ముగిసిన పవిత్రోత్సవాలు
పెదకాకాని: శివాలయంలో మూడు రోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు శుక్రవారం శాస్త్రోక్తంగా ముగిశాయి. పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో వేడుకల చివరిరోజైన శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ పర్యవేక్షణలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాగా, 20వ తేదీన శ్రీ భ్రమరాంబ అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించి విశేష పూజలు చేయనున్నారు. స్థానాచార్యులు పొత్తూరి సాంబశివరావు, ప్రధాన అర్చకులు పొత్తూరి లక్ష్మీనారాయణ వరప్రసాదు, దాతలు నేలవెల్లి కోటేశ్వరి, కర్నే శివ సందీప్ నాగశిరీష, రెడ్డి నవీన్ కుమార్ విజయలక్ష్మి, నేలివెల్లి నాగప్రత్యూష, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
వాటర్ గ్రిడ్ స్థలాన్ని
పరిశీలించిన పల్నాడు కలెక్టర్
విజయపురి సౌత్: మేకల గొంది నుంచి జలజీవన్ మిషన్ ద్వారా రూ.1200 కోట్లతో మాచర్ల నియోజకవర్గంతో పాటు పల్నాడు ప్రాంతానికి తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం సంబంధిత స్థలాన్ని అధికారులు పరిశీలించారు. మేకల గొందిలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసే స్థలంలో సర్వే మ్యాపులను పరిశీలించారు.అన్ని అనుమతులు మంజూరయితే నిర్మాణానికి ముహూర్తం ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో గురజాల ఆర్డీఓ వి.మురళీకృష్ణ, డీఎఫ్‌ఓ సందీప్ కుమార్, మాచర్ల తహసీల్దార్ కిరణ్ కుమార్, ఇరిగేషన్ ఈఈ రమేష్ పాల్గొన్నారు.

అందుబాటులోకి పురమిత్ర యాప్