
రెండు బైక్‌లు ఢీ.. ఇరువురికి గాయాలు
బల్లికురవ: ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొనటంతో ఇరువురు గాయాల పాలయ్యారు. ఈ ఘటన ఆదివారం మండలంలోని అంబడిపూడి –కొమ్మినేని వారిపాలెం లింకురోడ్డులో జరిగింది. కొమ్మినేనివారిపాలెం గ్రామానికి చెందిన కాకుమాను అరుణ్‌కుమార్ పని నిమిత్తం బైకు బల్లికురవ వెళుతున్నాడు. సోమవరప్పాడు గ్రామానికి చెందిన గుజ్జులైని శ్రీనివాసరావు బైకుపై కొమ్మినేని వారిపాలెం వెళుతూ ఒకరినొకరు ఢీకొన్నారు. స్థానికులు బల్లికురవ 108కి సమాచారం ఇవ్వటంతో ఈఎంటీ అశోక్ ప్రథమ చికిత్స తదుపరి క్షతగాత్రులను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇప్పటం వడ్డేశ్వరం పంట పొలాలకు వెళ్లే డొంక రోడ్డులో ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు ఆదివారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ ఖాజావలి సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. అతడి వద్ద బట్టల సంచి మాత్రమే కనిపించిందని, ఎటువంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. మృతుడు శరీరంపై బ్లూ కలర్ ఫ్యాంటు, లైట్ బ్లూ, పసుపు తెలుపు రంగు నిలువు చారల చొక్కా ధరించి ఉన్నాడని, మృతుడి వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉండవచ్చని, రెండు రోజుల నుండి ఇప్పటం వడ్డేశ్వరం ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాడని, ఎవరైనా ఈ మృతదేహాన్ని గుర్తిస్తే తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.
బైక్ అదుపు తప్పి యువకుడు మృతి
మేదరమెట్ల (అద్దంకి రూరల్): అధికవేగంతో వెళుతున్న యువకుడు బైకు అదుపుతప్పి కిందపడి మృతి చెందిన సంఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. మేదరమెట్ల పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం మండలంలో కోరిశపాడు గ్రామానికి చెందిన పాలేటి రాజేష్(22) ఒంగోలు వైపు నుంచి కొరిశపాడు వస్తుండగా తమ్మవరం ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద అధిక వేగంతో వచ్చి అదుపుతప్పి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

రెండు బైక్‌లు ఢీ.. ఇరువురికి గాయాలు

రెండు బైక్‌లు ఢీ.. ఇరువురికి గాయాలు

రెండు బైక్‌లు ఢీ.. ఇరువురికి గాయాలు