
ఫీల్డ్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేయాలి
ఎంఎస్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
కొమ్ము సుజన్ మాదిగ
బాపట్ల: చిన్నగంజాం మండలం కడవకుదురు గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ బినామీ కూలీలను ఏర్పరచుకొని రూ. 26 లక్షల ఉపాధి నిధులు స్వాహా చేశాడని మాదిగ సంక్షేమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము సుజన్ మాదిగ ఆరోపించారు. ఈమేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌లో డీఆర్‌ఓ గంగాధర్‌గౌడ్‌కు వినతి పత్రం అందించారు. బినామీ కూలీలను ఏర్పటు చేసి ఉపాధి నిధులు దిగమింగిన ఫీల్డ్ అసిస్టెంట్ రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరారు. వినతి పత్రం ఇచ్చినవారిలో ఎంఎస్‌పీఎస్ రాష్ట్ర నాయకులు గద్దె త్యాగరాజు, కొలకలూరి విజయ్ కుమార్ మాదిగ, వంశీ మాదిగ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ప్రత్తిపాటికి
చేదు అనుభవం
నరసరావుపేట: నాదెండ్లలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు చేదు అనుభవం ఎదురైంది. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి గ్రామంలో నారాయణస్వామి మఠం ఏరియాలో పర్యటించారు. ఈ సమయంలో టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి వెళ్లగక్కారు. పొగాకు కొనుగోలు కేంద్రంలో రైతులకు అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకు అధికారులు కొనుగోలు చేయకుండా, తక్కువ ధరతో రైతులను మోసగిస్తున్నారని ఆయన దృష్టికి తెచ్చారు. నిబంధనల పేరిట పొగాకును తిరస్కరిస్తున్నారని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. అంతేకాక గ్రామంలో చోరీలు అధికంగా జరుగుతున్నాయని, ఇప్పటికే సుమారు 10కి పైగా బైకులు చోరీకి గురయ్యాయని ఆయన దృష్టికి తెచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. గ్రామస్తులు సమస్యలను వివరిస్తుండగానే ఎమ్మెల్యే పుల్లారావు పట్టించుకోకుండా కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఫీల్డ్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేయాలి