
స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలి
డాక్టర్ మధుకర్ గుప్తా
బాపట్ల స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధం కావాలని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్స్ చైర్మన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్టాండింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మధుకర్ గుప్తా అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ, పురపాలక సంఘాల ఎన్నికల నిర్వహణపై జిల్లా అధికారులతో మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నిర్వహణ ఉండాలని అన్నారు. పంచాయతీరాజ్ చట్ట ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. డీలిమిటేషన్, రిజర్వేషన్ అమలు పరిశీలించాలని, ఓటర్ల జాబితా సిద్ధం చేసుకోవాలన్నారు. రాజకీయంగా ప్రభావితం చేసే అంశాలను ముందస్తుగా గుర్తించాలన్నారు. అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకుని ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో అధికారులు అత్యంత బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. బాపట్ల జిల్లాలో 459 గ్రామపంచాయతీలు ఉన్నాయన్నా రు. 426 పంచాయతీలకు ఎన్నికలు జరిగా యని, మిగిలినవి కోర్టు కేసుల నేపథ్యంలో నిలిచిపోయాయన్నారు. 4,306 వార్డు లు ఉండగా, గత ఎన్నికల్లో గెలుపొందిన వారి అధికారాలు 2026 ఏప్రిల్ ఒకటో తేదీ నాటితో ముగుస్తాయన్నారు. జిల్లా పరిషత్ స్థానాలు గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోనే ఉన్నాయన్నారు. గుంటూరు పరిధిలో 862 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 57 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయన్నారు. ప్రకాశం జిల్లా పరిషత్ పరిధిలో 792 ఎంపీటీసీ స్థానాలు, 57 జెడ్పీటీసీ స్థానాలున్నాయన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియకు ప్రణాళికలు రూపొందించాలని ఆమె సూచించారు. డీఆర్వో జి.గంగాధర్‌గౌడ్ మాట్లాడుతూ గత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 50 శాతం మహిళలకు రిజర్వేషన్ అమలు చేశామని తెలిపా రు. జిల్లాలో 12,60,997 ఓటర్లు ఉండగా, అందు లో 6,44,171 మంది మహిళా ఓటర్లు, 6,16,826 మంది పురుష ఓటర్లు ఉన్నారన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో డీపీఓ ప్రభాకరరావు, గుంటూరు జెడ్పీ సీఈవో జ్యోతిబసు, ప్రకాశం జెడ్పీ సీఈవో చిరంజీవి, ఆర్డీవో పి గ్లోరియా, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.