
మహిళ నేత్రాలు దానం చేసిన కుటుంబసభ్యులు
తెనాలి: స్థానిక నాజర్‌పేటకకు చెందిన తెనాలి రైల్వేస్టేషన్ మేనేజర్, భారతీయ మజ్దూర్ సంఘ్ జోనల్ నాయకుడు టీవీ రమణ మాతృమూర్తి సీతాదేవి (80) ఆదివారం మృతిచెందారు. ఆమె కోరిక ప్రకారం నేత్రదానానికి సమాచారం పంపారు. సంబంధిత సంస్థ ప్రతినిధులు అరవింద, కృష్ణమోహన్ వచ్చి, ఆమె నేత్రాలను సేకరించి పంపారు. చీకటి ప్రపంచం నుండి ఇద్దరు రేపటి వెలుగులను చూస్తారనే విషయం తమకు ఎంతో ఆనందంగా ఉందని టీవీ రమణ అన్నారు. హిందూ చైతన్య వేదిక, విశ్వహిందూ పరిషత్, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, సీతాదేవి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. నేత్రదానాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
మంత్రి ప్రకటనలో స్పష్టత లేదు
లక్ష్మీపురం: నెల రోజుల కిందటే సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ స్పందించకుండా, ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూ మంత్రి శనివారం ప్రకటన చేశారని, జీతాలు ఎప్పటి నుంచి పెంచుతామన్నారని కానీ, ఎంత పెంచుతారని కానీ స్పష్టత లేనందునే రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి దిగారని ఏపీ మున్సిపల్ వర్కర్స్ – ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. గుంటూరు తక్కెళ్లపాడు హెడ్‌వాటర్ వద్ద ఆదివారం కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభంతో నగరపాలక సంస్థకు చెందిన ఉండవల్లి, మంగళగిరి, సంగం జాగర్లమూడి, తక్కెళ్లపాడు హెడ్ వాటర్ కార్మికులు సమ్మెలోకి దిగడంతో గుంటూరు నగరానికి నీటి సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. మున్సిపల్ అధికారులు సమ్మె చేస్తున్న కార్మికులపై ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్ప డినా పారిశుద్ధ్య కార్మికులను కూడా సమ్మెలోకి దింపుతామని హెచ్చరించారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులకు జీవో నంబర్ 36 ప్రకారం వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాల అమలు, ఇంజనీరింగ్ కార్మికుల కేటగిరీల నిర్ధారణలో జరిగిన తప్పులు సరి చేయడం, గత 17 రోజుల సమ్మె ఒప్పందాలకు జీవోలు ఇవ్వకుంటే రాష్ట్రవ్యాప్తంగా సమ్మెను ఉధృతం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో యూని యన్ నగర అధ్యక్షులు పూనేపల్లి శ్రీని వాసరావు, జిల్లా నాయకులు పాశం పూర్ణచంద్రరావు, ఇంజినీరింగ్ విభాగం నాయకులు యా సిర్ ఖాన్, బాలకృష్ణ, రవి, జానీ, నాగరాజు, మహేష్, సురేష్, లీక్ వర్కర్లు పాల్గొన్నారు.

మహిళ నేత్రాలు దానం చేసిన కుటుంబసభ్యులు