
కొత్త కోర్సులు పిలుస్తున్నాయి.. బ్రో !
వేటపాలెం: కష్టపడి ఇంజినీరింగ్ పూర్తి చేసినా యువకులకు కొలువులు దక్కడం లేదు. ఇంటి దగ్గరే ఉంటున్న పిల్లలను చూసి పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు పట్టణాలకు వెళ్లి చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ, చాలీచాలని జీతాలతో అవస్థలు పడుతున్నారు. దీంతో ఇటీవల సివిల్, మెకానికల్ కోర్సుల జోలికి వెళ్లడం విద్యార్థులు మానేశారు. సీఎస్‌ఈ, ఈసీ బ్రాంచ్‌లకు డిమాండ్ పెరిగింది. దీంతో 70 శాంతం మంది ఈ రెండు బ్రాంచిలే ఎంపిక చేసుకుంటున్నారు. అయితే, కోర్సు పూర్తి చేసుకున్న తరువాత ఉద్యోగ అవకాశాలు అందరికీ అందడం లేదు. కేవలం 15 నుంచి 20 శాతం మందికే వస్తున్నాయి.
ప్రత్యామ్నాయాలు తప్పనిసరి
సీఎస్‌ఈ, ఈసీ బ్రాంచ్‌లకు దీటుగా నేడు మరికొన్ని కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఆర్టీఫీషియల్ ఇంటిలిజెన్స్, డెటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ వంటి ఎమర్జింగ్ ఏరియాలను కవర్ చేయగల నాలెడ్జ్ ఉన్న కోర్సులివి. రోబోటెక్ పరిజ్ఞానం ఉండటం ఈ కోర్సుల్లో ప్రధాన పాత్ర. వీటికి ప్రస్తుత మార్కెట్‌లో కూడా మంచి డిమాండ్ ఉంది.
మేజర్, మెయిన్ కోర్సులు చేసే అవకాశం
జిల్లా వ్యాప్తంగా చీరాల, బాపట్లలో ఉన్న నాలుగు ఇంజినీరింగ్ కళాశాలల్లో 3,000 సీట్లు పైగా ఉన్నాయి. వీటిలో సీఎస్‌ఈ, ఈసీఈ, ఐటీ బ్రాంచుల్లో 2,200 సీట్లు ఉన్నాయి. మెకానికల్, ఈఈఈ, సివిల్ వంటి కోర్ బ్రాంచుల విద్యార్థులకు సైతం సాఫ్ట్‌వేర్ రంగంలో అవకాశాలు ఉండటం విశేషం. ప్రభుత్వం ప్రకటించిన నూనత జాతీయ విద్యా విధానంతో ఒకే సమయంలో మేజర్, మెయిన్ కోర్సులు చేసుకునే వెసులుబాటు ప్రస్తుతం ఉంది. మెయిన్‌గా కోర్ కోర్సులు తీసుకున్నా మైనర్ కింద ఏఐఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్సు చేయడానికి అవకాశం ఉంది. ఈసీఈలో చేరితే సెమీ కండక్టర్, చిప్ తయారీ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈఈఈ విద్యార్థులైతే ఈఎల్‌ఎస్, ఎంబెడ్ సిస్టం లాంటి కోర్సులు నేర్చుకోవడంతో మంచి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. సివిల్ ఇంజినీరింగ్ వారు సాఫ్ట్‌వేర్ కోర్సులు నేర్చుకోవడానికి అవకాశం ఉంది.
ఇంజినీరింగ్ విద్యలో పలు నూతన కోర్సులు ఆసక్తి చూపుతున్న యువత చీరాల, బాపట్ల కళాశాలల్లో వేలాది సీట్లు డేటా సైన్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్, సీఎస్‌ఈ కోర్సుల వైపు మొగ్గు