
ఓటరు క్లెయిమ్‌ల విచారణ వేగవంతం చేయండి
చీరాల టౌన్: బీఎల్‌వోలు విధులను సమర్థవంతంగా నిర్వహించి ఓటరు క్లెయిమ్‌ల విచారణ వేగవంతం చేయాలని ఈఆర్‌వో, ఆర్డీఓ టి.చంద్రశేఖర నాయుడు సూచించారు. శుక్రవారం చీరాల మండల పరిషత్ కార్యాలయం సమావేశపు హాలులో చీరాల నియోజకవర్గంలోని బీఎల్‌వోలతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఓటరు అర్జీలు పెండింగ్‌లో లేకుండా పనిచేయాలన్నారు. నిశితంగా పరిశీలించి క్షేత్ర స్థాయిలో విచారణ చేయాలని పేర్కొన్నారు. అభ్యంతరాల వివరాలను తెలియజేయాలని కోరారు. మృతుల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించాలన్నారు. విచారణ ఈసీ నిబంధనల ప్రకారం చేయాలని కోరారు. సమస్యలుటే తమకు తెలియజేయాలని సూచించారు. తహసీల్దార్ కె.గోపీకృష్ణ, ఎన్నికల డీటీ సుశీల, మున్సిపల్, వేటపాలెం మండలాల్లోని బీఎల్‌వోలు పాల్గొన్నారు.