
రైతన్నల క‘న్నీటి’ తడులు...
వాతావరణ పరిస్థితుల్లో విపరీతమైన మార్పుల ప్రభావం ఖరీఫ్ రైతాంగాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ముందుగా వెద పద్ధతిలో సాగైన పంటకు నీరందక ఎండుపోతున్నాయి. అదనుకు కురవాల్సిన వర్షాలు పడకపోవడంతోపాటు ఎండలు మండుతూ, విపరీతమైన వేడి గాలులు వీస్తుండటంతో మొలక దశలో ఉన్న వెద పద్ధతిలోని వరి మొక్కలు దెబ్బతింటున్నాయి. బీటలు వారిన పొలాలకు డీజిల్ ఇంజిన్లు, విద్యుత్తు మోటార్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు, వేమూరు, భట్టిప్రోలు, అమృతలూరు, చుండూరు మండలాలలో విత్తనాల తరుణం కావడం, ఇటు వర్షాలు పడకపోవడం, సాగు నీటి కాలువల ద్వారా నీరు విడుదల కాక సమయం మించిపోతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – కొల్లూరు

రైతన్నల క‘న్నీటి’ తడులు...