
ఆది ఆంధ్ర కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడుగా గుండాల ఎన్ని
బాపట్ల: దగ్గుమళ్లివారిపాలెంలోని ఆది ఆంధ్ర కో–ఆపరేటివ్ ఫార్మింగ్ సొసైటీ అధ్యక్షుడిగా గుండాల విజయ్ డేవిడ్‌రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలోని ఏవీవీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఎన్నికల అధికారి లలిత కుమారి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. ఆది ఆంధ్ర కోఆపరేటివ్ సొసైటీలో మొత్తం 177 మంది సభ్యులు ఉండగా ఎన్నికల్లో 158 మంది సభ్యులు పాల్గొన్నారు. అంతా ఆమోదం తెలపడంతో అధ్యక్షుడిగా గుండాల విజయ్ డేవిడ్‌రాజు, ఉపాధ్యక్షుడిగా బి.వెంకటస్వామి, డైరెక్టర్లుగా బిల్లా ఎడ్విన్ రాజు, సలగల ఏసమ్మ, కూచిపూడి పరిశుద్ధం, మేకల సత్యానందం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరి ఎన్నికను ఎన్నికల అధికారి లలితకుమారి అధికారికంగా ప్రకటించారు. అధ్యక్షుడు గుండాల విజయ డేవిడ్‌రాజు మాట్లాడుతూ ఆది ఆంధ్ర సొసైటీ ఎన్నికల్లో వరుసగా నాలుగో సారీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సొసైటీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఎన్నికల అధికారి లలితకుమారి అధ్యక్షుడికి నియామక పత్రాన్ని అందించారు.