
బాలలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి
రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు బత్తుల పద్మావతి
బాపట్ల: బాలలకు చదువుకునే చోట మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి సూచించారు. బాపట్ల జిల్లాలోని కర్లపాలెం మండలంలో బుధవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. గణపవరం జిల్లా పరిషత్ హైస్కూలు ఆవరణలో విద్యార్థులతో పనులు చేయించటాన్ని గమనించి ఆమె ప్రధానోపాధ్యాయలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులను, హాజరు పటికను పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. వంటకాలను రుచి చూశారు. బాలల సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు 1098 నంబరును ప్రతి చోట రాయించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. ప్రతి పాఠశాలలో తప్పని సరిగా ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయాలని కోరారు. బాల బాలికలకు వారి హక్కులకు భంగం కలిగిస్తే బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. బాపట్లలోని బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో ముఖముఖిగా మాట్లాడారు. వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలని కోరారు. కార్యక్రమంలో చారులత, డీసీపీఓ పురుషోత్తమరావు, కర్లపాలెం ఎంఈఓ మనోరంజనీ పాల్గొన్నారు.