Weekly Horoscope From Feb 19th - Feb 25th 2023 In Telugu: Know Weekly Astrological Predictions - Sakshi
Sakshi News home page

Weekly Horoscope Telugu: ఈ వారంలో ఈ రాశి వారు ఏ పని చేపట్టినా విజయమే..

Published Sun, Feb 19 2023 6:46 AM

Weekly Horoscope Telugu 19 02 2023 To 25 02 2023 - Sakshi

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. జీవితభాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. నూతన ఉద్యోగప్రాప్తి. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి.  వారం చివరిలో  ఆస్తి వివాదాలు. నేరేడు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది.  వాహనయోగం. నూతన పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబీ, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
అనుకున్నంత సొమ్ము సమకూరి అప్పులు సైతం తీరతాయి. నిరుద్యోగులు జీవితాశయం నెరవేరుతుంది. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. ఆస్తిలాభాలు ఉండవచ్చు. గృహం, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు మరింత అనుకూలమైన సమయం. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. పసుపు, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి.  స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు విస్తరణకు  నూతన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో ఊహించని ఇంక్రిమెంట్లు రాగలవు. వారం మధ్యలో ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు.  సంఘంలో  పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి, కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో  ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. శ్రమాధిక్యం. పసుపు, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆస్తి వ్యవహారాలలో కొత్త అగ్రిమెంట్లు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటి నిర్మాణప్రయత్నాలు కలసివస్తాయి.  నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. గులాబీ, లేత ఎరుపు రంగులు.  ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు. వాహనయోగం.  వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు లభిస్తాయి. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో మానసిక ఆందోళన. స్వల్ప ఆరోగ్య సమస్యలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఉత్సాహంతో ముందడుగు వేసి అనుకున్న పనులు చక్కదిద్దుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థుల జీవితాశయం నెరవేరుతుంది.  సోదరుల నుంచి ధనలాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు. కళారంగం వారికి అవకాశాలు దక్కుతాయి. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. ఆకుపచ్చ, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆరోగ్యం మందగిస్తుంది. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగయత్నాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఉంటాయి, విస్తరణ కార్యక్రమాలలో అవాంతరాలు. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఎదురుకావచ్చు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో వాహనయోగం. గులాబీ, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
అనుకున్న సమయానికి డబ్బు సమకూరుతుంది. ఒక సమాచారం నిరుద్యోగులకు ఉత్సాహాన్నిస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో మరింత లాభాలు చేకూరుతాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు యత్నాలు సఫలం. వారం చివరిలో వృథా ఖర్చులు.  ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఏ పని చేపట్టినా విజయమే. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. నూతన పెట్టుబడులతో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు అనుకోని విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం ప్రారంభంలో  శ్రమాధిక్యం. మిత్రులు ఒత్తిడులు తెస్తారు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆశించినంతగా డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి. కుటుంబసమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి.  చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.  వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు కొంతమేర తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. 

Advertisement
Advertisement