Weekly Horoscope: 1 మే నుంచి 7 మే 2022 వరకు

Weekly Horoscope In Telugu 01-05-2022 To 07-05-2022 - Sakshi

వారఫలాలు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
నూతనోత్సాహంతో కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. శుభవార్తలు వింటారు. మీలోని ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. విద్యావకాశాలు పెరుగుతాయి. ఆస్తులు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వ్యాపారాలు గతం కంటే విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాల ఆశలు కొన్ని నెరవేరతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
అనుకున్న వ్యవహారాలు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో సత్సబంధాలు నెలకొంటాయి. ఇంటి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సమాజంలో ప్రత్యేకతను చాటుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వ్యూహాత్మకంగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఎలాంటి ఇబ్బంది ఎదురైనా అధిగమిస్తారు. కళారంగం వారికి ఉత్సాహవంతంగా గడుస్తుంది. వారం ప్రారంభంలో మానసిక ఆందోళన. ఆరోగ్యసమస్యలు. ఆకుపచ్చ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఎటువంటి పని చేపట్టినా విజయమే. ఆప్తులు మీకు తోడుగా నిలుస్తారు. నూతన ఉద్యోగావకాశాలు దక్కుతాయి. నేర్పు, ఓర్పుతో క్లిష్టసమస్యలు పరిష్కరించుకుంటారు. ధ్యానం, యోగ వంటి కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. దైవదర్శనాలు చేసుకుంటారు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. మీ సేవలకు ప్రశంసలు అందుతాయి. ఆర్థికంగా బలం చేకూరుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి. రాజకీయవర్గాలకు కలసివచ్చే సమయం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. బంధువులతో తగాదాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయుని స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
అనుకున్న కార్యక్రమాలు మరింత సజావుగా సాగుతాయి. ఆలోచనలు తక్షణం అమలు చేసి అందరిలోనూ గుర్తింపు పొందుతారు. విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. యుక్తితో ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితిలో గందరగోళం తొలగుతుంది. దీర్ఘకాలిక రుణబాధల నుంచి విముక్తి పొందుతారు. వ్యాపారాలు మునుపటి కంటే కొంత నయమనిపిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గి ఊరట లభిస్తుంది. కళారంగం వారికి ఊహించని అవకాశాలు దక్కవచ్చు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. తెలుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. ఖర్చులు తగ్గించి పొదుపు పాటిస్తారు. ఇతరులకు కొంత సాయం అందిస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. చేపట్టిన వ్యవహారాలు మరింత సజావుగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. నిరుద్యోగులకు భవిష్యత్తుపై భరోసా కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. బంధువులతో సత్సంబంధాలు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో మీ ఊహలు నిజం కాగలవు. పారిశ్రామికవర్గాలకు శుభవర్తమానాలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. మానసిక ఆందోళన. తెలుపు, గులాబీ రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక వ్యవహారాలు మొదట్లో కొంత ఇబ్బంది కలిగించినా క్రమేపీ సర్దుకుంటాయి. ఇంటాబయటా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు ముఖ్యమైన వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో హోదాలు దక్కించుకునే సూచనలు. రాజకీయవర్గాల చిరకాల కోరిక నెరవేరుతుంది. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
అనుకున్న విధంగా ఆర్థిక పరిస్థితి ఉంటుంది. నూతన ఉద్యోగావకాశాలు దగ్గరకు వచ్చే వీలుంది. దూరపు బంధువుల నుంచి శుభ వార్తలు. స్థిరాస్తి విషయంలో అనుకున్న ఒప్పందాలు కుదురుతాయి. కుటుంబంలో వేడుకలు.  ఆరోగ్య సమస్యలు తీరతాయి. వివాహయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగాలలో యుక్తితో ఆటంకాలు అధిగమిస్తారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు దగ్గరకు వస్తాయి. వారం మధ్యలో మానసిక ఆందోళన. గులాబీ, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సేవాదృక్పథం పెరుగుతుంది. ఇంతకాలం పడిన ఇబ్బందులు తీరే సమయం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహాన్నిస్తాయి. సోదరులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఇంటి నిర్మాణయత్నాలలో మరింత పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు అధికమైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. రాజకీయవర్గాలకు అంచనాలు ఫలిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
జీవితాశయం నెరవేరే సమయం. ఆప్తులు అందించిన సలహాలు ఉపయుక్తంగా ఉంటాయి. ఏ వ్యవహారమైనా అవలీలగా పూర్తి చేస్తారు. నేర్పుతో సమస్యల నుంచి గట్టెక్కుతారు. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి అవసరాలు తీరతాయి. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులు సకాలంలో సమకూరతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గవచ్చు. పారిశ్రామికవర్గాల కృషి ఫలిస్తుంది. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. చాకచక్యం, నేర్పుగా వివాదాలను పరిష్కరించుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగి ఊరట చెందుతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రావచ్చు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఒక వ్యక్తి ద్వారా ఊహించని విధంగా సాయం పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు మరింత రాగలవు. కళారంగం వారికి ఉత్సాహం పెరుగుతుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. మిత్రులతో కలహాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
నెమ్మదిగా ప్రారంభమైన కార్యక్రమాలు క్రమేపీ వేగం పుంజుకుంటాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఊహించని ఉద్యోగపిలుపు రావచ్చు. సమాజంలో ప్రత్యేక గౌరవం, ఆదరణ లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మునుపటి కంటే మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయవర్గాలకు కీలక సమాచారం రాగలదు. వారం మధ్యలో వృథా ఖర్చులు. స్వల్ప అనారోగ్యం. నేరేడు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
వ్యవహారాలలో కొద్దిపాటి అవాంతరాలు ఎదురుకావచ్చు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు.  సోదరుల ద్వారా అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. అయితే మితిమీరిన ఆర్థిక హామీలు వద్దు. మీ మాటలలో తొందరపాటు వద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గత సంఘటనలు ఎదురవుతాయి. వాహనాలు విషయంలో నిర్లక్ష్యం వద్దు. వేడుకలు చివరిక్షణంలో వాయిదా పడవచ్చు. వ్యాపారాలు విస్తరించడంలో అవాంతరాలు. ఉద్యోగాలలో అదనపు పనిభారం. కళారంగం వారికి కొన్ని చిక్కులు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ఎరుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top