ఈ రాశి వారికి బంధువుల నుంచి ధనలాభం | Rasi Phalalu: Daily Horoscope On 30-05-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి బంధువుల నుంచి ధనలాభం

May 30 2026 3:39 AM | Updated on May 30 2026 3:40 AM

Rasi Phalalu: Daily Horoscope On 30-05-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధికజ్యేష్ఠ మాసం, తిథి: శు.చతుర్దశి ఉ.11.05 వరకు, తదుపరి పౌర్ణమి, నక్షత్రం: విశాఖ ప.12.55 వరకు తదుపరి అనూరాధ, వర్జ్యం: సా.5.19 నుండి 7.05 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.29 నుండి 7.12 వరకు, అమృత ఘడియలు: రా.3.55 నుండి 5.40 వరకు.

సూర్యోదయం :    5.29
సూర్యాస్తమయం     :  6.25
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు 

మేషం: బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనులలో ప్రతిబంధకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

వృషభం: మిత్రులతో మరింత సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మిథునం: చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి. సంఘంలో ఆదరణ. విద్యార్థులకు అనుకూలస్థితి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం: వ్యవహారాలలో ఆటంకాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. దూరప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

సింహం: రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. బంధువులతో విభేదాలు. ధనవ్యయం. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలబ్ధి. వాహనాలు కొంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభం. ఉద్యోగాలలో హోదాలు.

తుల: వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

వృశ్చికం: సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి విషయాలు తెలుస్తాయి. వాహనసౌఖ్యం. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమర్థతను చాటుకుంటారు.

ధనుస్సు: అనుకున్న వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాల యత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.

మకరం: ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వ్యాపారాల వృద్ధి. ఉద్యోగాలలో ఉత్సాహం.

కుంభం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చల్లో అనుకూలత. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మీనం: వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. పనుల్లో జాప్యం. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

Advertisement
 
Advertisement
Advertisement