ఈ రాశి వారికి మిత్రుల నుంచి దనలబ్ధి | Rasi Phalalu: Daily Horoscope On 29-05-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి మిత్రుల నుంచి దనలబ్ధి

May 29 2026 3:59 AM | Updated on May 29 2026 8:21 AM

Rasi Phalalu: Daily Horoscope On 29-05-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధికజ్యేష్ఠ మాసం, తిథి: శు.త్రయోదశి ఉ.9.34 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: స్వాతి ఉ.10.46 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం: ప.4.52 నుండి 6.36 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.56 వరకు, తదుపరి ప.12.23 నుండి 1.15 వరకు, అమృత ఘడియలు: రా.3.20 నుండి 5.04 వరకు.

సూర్యోదయం : 5.29
సూర్యాస్తమయం : 6.25
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం....  ప్రముఖుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆర్థికాభివృద్ధి. ఉద్యోగాన్వేషణలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

వృషభం..  కార్యజయం. ఆస్తిలాభం. రాబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆశ్చర్యకర మార్పులు.

మిథునం....  బంధువర్గంతో తగాదాలు. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కర్కాటకం...  రుణబాధలు తప్పవు. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

సింహం...  సమస్యల పరిష్కారం. శుభవార్తా శ్రవణం. ధనలబ్ధి. పరిచయాలు విస్తృతమవుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కన్య.....  పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. ప్రయాణాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

తుల......  ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

వృశ్చికం.... సోదరులతో విభేదాలు. ఆర్థికంగా ఇబ్బందులు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో చికాకులు.

ధనుస్సు...  పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. భూలాభాలు. నూతన ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మకరం.... మిత్రుల నుంచి దనలబ్ధి. నూతన వ్యక్తుల పరిచయం. భూవివాదాల పరిష్కారం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.

కుంభం....  కొత్త్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. కాంట్రాక్టులు చేజారవచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మీనం..  వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. మిత్రులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

Advertisement
 
Advertisement
Advertisement