
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి: శు.పాడ్యమి ఉ.6.43 వరకు, తదుపరి విదియ తె.4.34 వరకు (తెల్లవారితే గురువారం), నక్షత్రం: మృగశిర తె.3.15 వరకు (తెల్లవారితే గురువారం), తదుపరి ఆరుద్ర, వర్జ్యం: ఉ.9.49 నుండి 11.20 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.31 నుండి 12.22 వరకు, అమృత ఘడియలు: రా.7.01 నుండి 8.32 వరకు.
సూర్యోదయం : 5.29
సూర్యాస్తమయం : 6.25
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం.. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా. పనుల్లో ఆటంకాలు. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
వృషభం... కుటుంబసమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
మిథునం.... కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు.
కర్కాటకం... చిన్ననాటి మిత్రులతో సఖ్యత. బంధువులను కలుసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు అనుకూల మార్పులు.
సింహం..... శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. వాహన, వస్తులాభాలు. వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రోత్సాహం.
కన్య.... శ్రమ మరింత పెరుగుతుంది. భూవివాదాలు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
తుల.... కుటుంబంలో చికాకులు. ఆదాయానికి మించి ఖర్చులు. బంధువులతో విభేదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో గందరగోళంగా ఉంటుంది.
వృశ్చికం... ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.
ధనుస్సు... నూతన వ్యక్తుల పరిచయాలు. విద్య, ఉద్యోగావకాశాలు. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త పనులకు శ్రీకారం. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు.
మకరం..... మిత్రులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. పనుల్లో ప్రతిబంధకాలు. దైవచింతన. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
కుంభం....... రాబడికి మించి ఖర్చులు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.
మీనం.... నూతన ఒప్పందాలు. ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి. విద్యార్థులకు అనుకూల సందేశం. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు మంచి గుర్తింపు.