
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి: బ.అష్టమి సా.4.03 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: పునర్వసు సా.5.25 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: రా.1.12 నుండి 2.45 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.03 వరకు తదుపరి రా.10.34 నుండి 11.23 వరకు, అమృత ఘడియలు: ప.3.11 నుండి 4.41 వరకు.
సూర్యోదయం : 5.56
సూర్యాస్తమయం : 5.38
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
వృషభం.... రుణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ.
మిథునం.... ఉద్యోగయత్నాలు సానుకూలం. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. పదవీయోగం.
కర్కాటకం... ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.
సింహం.... బంధువులతో సఖ్యత. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త ఆశలు. గృహ, వాహనయోగాలు.
కన్య.... దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. పనులలో విజయం. శుభవార్తలు. ఆస్తి లాభం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. వాహనయోగం.
తుల.... కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. దూరప్రయాణాలు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
వృశ్చికం... దూరప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వ్యయప్రయాసలు.
ధనుస్సు.... పనుల్లో విజయం. కీలక నిర్ణయాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. దైవదర్శనాలు.
మకరం...... శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.
కుంభం.... ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అదనపు బా«ధ్యతలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం. ఆలయాలు సందర్శిస్తారు.
మీనం... శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటుంది.