
మేషం...
ఆదాయం కొంత నిరాశాజనకంగా ఉంటుంది. దూరప్రయాణాలు ఉండవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. కుటుంబబాధ్యతలు కొంత చికాకు పరుస్తాయి. ఆరోగ్యసమస్యలు, ఔషధసేవనం. కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలలో ఇబ్బందులు నెలకొనవచ్చు. ఉద్యోగులకు ఉన్నతస్థాయి నుంచి ఒత్తిళ్లు. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో శుభవర్తమానాలు. అదనపు ఆదాయం. తీర్థయాత్రలు.లేత గులాబీ, పసుపు రంగులు. శ్రీఉమాదేవి స్తోత్రాలు పఠించండి.
వృషభం...
రావలసిన బాకీలు సకాలంలో అందుతాయి. కార్యక్రమాలలో విజయం మీదే. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్య ఒకటి పరిష్కారం. భూములు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. పారిశ్రామికవేత్తలు అనుకున్న లక్ష్యాలు సా«ధిస్తారు. వారం చివరిలో ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు. ఆరోగ్య సమస్యలు. గులాబీ, లేత పసుపు రంగులు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.
మిథునం...
నూతన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. తీర్థయాత్రలు చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వాహనాలు కొంటారు. ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. స్థిరాస్తి వృద్ధి కాగలదు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ముందుకు సాగుతారు. రాజకీయవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. కుటుంబసమస్యలు.ఎరుపు, లేత గులాబీరంగులు, శ్రీశివాష్టకం పఠించండి.
కర్కాటకం...
కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. అందరిలోనూ విశేష గౌరవం పొందుతారు. స్నేహితుల నుంచి శుభవర్తమానాలు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహన, కుటుంబసౌఖ్యం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో ఆశలు ఫలించే సమయం. కళాకారుల అంచనాలు ఫలించే సమయం. వారం చివరిలో అనుకోని ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. నీలం, నలుపు రంగులు, శ్రీశివపంచాక్షరి పఠించండి.
సింహం...
చిన్ననాటి స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. యత్నకార్యసిద్ధి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాలలో విజయం. సోదరుల సహాయం అందుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత అనుకూల సమయం. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వైరం. దూరప్రయాణాలు.ఆకుపచ్చ, ఎరుపు రంగులు, శ్రీమీనాక్షిస్తుతి పఠించండి.
కన్య......
కార్యజయం. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. శ్రేయోభిలాషుల సలహాలతో ముందుకు సాగుతారు. అనుకున్న విధంగా సొమ్ము అందుతుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి మరింత వృద్ధి చెందుతుంది. చర్చలు సఫలం. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఆందోళన.నీలం, సిమెంట్ రంగులు, శ్రీసుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
తుల...
ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. సోదరులు, మిత్రుల చేయూత లభిస్తుంది. నేర్పుగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఇంటి నిర్మాణ, కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త భాగస్వాములు చేరతారు. ఉద్యోగస్తులకు కోరుకున్న మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలు, కళాకారులకు మంచి గుర్తింపు రాగలదు. వారం ప్రారంభంలో ధననష్టం. కుటుంబసమస్యలు. ఇంటాబయటా ఒత్తిడులు.నలుపు, లేత ఆకుపచ్చ రంగులు, దుర్గాస్తోత్రాలు పఠిస్తే మంచిది.
వృశ్చికం.......
ఆదాయం సంతృప్తినిస్తుంది. సన్నిహితులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. గత జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ముఖ్యమైన ఆహ్వానాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వాహనసౌఖ్యం. వ్యాపారాలలో పెట్టుబడులకు అవకాశాలు. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు సాధిస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు శ్రమ ఫలిస్తుంది. వారం మధ్యలో «అనుకోని ఖర్చులు. దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు.ఎరుపు, గులాబీ రంగులు, దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు.....
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. స్నేహితులతో విభేదాలు తొలగుతాయి.కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. కాంట్రాక్టులు కైవసం చేసుకుంటారు. దూరపు బంధువుల సహాయం అందుతుంది. వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు సన్మానయోగం. వారం చివరిలో అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం.శ్రమాధిక్యం. పనులలో ఆటంకాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.
మకరం.....
కార్యక్రమాలు సజావుగా కొనసాగుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. దూరప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. చిరకాల కోరిక నెరవేరుతుంది. వాహనసౌఖ్యం. శత్రువులు సైతం అనుకూలంగా మారతారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఇబ్బందులు అధిగమిస్తారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు దక్కుతాయి. కళాకారులకు నూతన అవకాశాలు దరి చేరతాయి. వారం చివరిలో ప్రయాణాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. నిర్ణయాలు మార్చుకుంటారు. ఒత్తిడులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
కుంభం....
కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలోని అందరితోనూ వివాదాలు తీరతాయి. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. పరిచయాలు పెరిగి ఉత్సాహంగా సాగుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగులకు మరింత గుర్తింపు రాగలదు. రాజకీయవేత్తలు, కళాకారులకు లక్ష్యాలు నెరవేరే సమయం. వారం ప్రారంభంలో కుటుంబసమస్యలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. లేత పసుపు, ఎరుపు రంగులు, శ్రీదత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
మీనం....
ప్రముఖ వ్యక్తులు పరిచయమై సహకరిస్తారు. అందరిలోనూ మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలపై చర్చలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో భాగస్వాములు చేరతారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు గౌరవ పురస్కారాలు..వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. శ్రమాధిక్యం. అనారోగ్యం. బంధువిరోధాలు.ఆకుపచ్చ, నీలం రంగులు, శ్రీమహాలక్ష్మీ పంచరత్నావళి పఠించండి.