గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.దశమి ఉ.10.34 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: పుష్యమి సా.4.34 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం: తె.4.55 నుండి 6.27 వరకు (తెల్లవారితే ఆదివారం), దుర్ముహూర్తం: ఉ.6.02 నుండి 7.37 వరకు, అమృత ఘడియలు: ఉ.10.26 నుండి 11.38 వరకు.
సూర్యోదయం : 6.01
సూర్యాస్తమయం : 6.08
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు
మేషం: ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు. స్వల్ప అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు.
వృషభం: ప్రముఖ వ్యక్తుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. భూవివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు మెరుగుపడతాయి.
మిథునం: వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.
కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతన విద్యావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. సన్మానాలు జరుగుతాయి. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోభివృద్ధి.
సింహం: సన్నిహితులతో వివాదాలు. ఆర్థికంగా కొంత ఇబ్బంది. పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపార లావాదేవీలు కొంత అనుకూలం. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.
కన్య: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు వింటాలు. విచిత్ర సంఘటనలు. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ఆకస్మిక ధనలాభం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
తుల: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.
వృశ్చికం: కుటుంబంలో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత సామాన్యంగా ఉంటాయి. దైవచింతన.
ధనుస్సు: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. సోదరులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
మకరం: పనులు సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలం.
కుంభం: ప్రముఖులు పరిచయం. సంఘంలో ప్రత్యేక గుర్తింపు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.
మీనం: ఉద్యోగయత్నాలు నెమ్మదిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.


