ఈ రాశి వారికి ఆస్తిలాభం.. శుభవార్తలు | Rasi Phalalu: Daily Horoscope On 26-05-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆస్తిలాభం.. శుభవార్తలు

May 26 2026 3:56 AM | Updated on May 26 2026 3:56 AM

Rasi Phalalu: Daily Horoscope On 26-05-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధికజ్యేష్ఠ మాసం, తిథి: శు.దశమి ఉ.7.47 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: ఉత్తర ఉ.6.57 వరకు, తదుపరి హస్త, వర్జ్యం: ప.3.36 నుండి 5.15 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.03 నుండి 8.55 వరకు, తదుపరి రా.10.50 నుండి 11.34 వరకు, అమృత ఘడియలు: రా.1.30 నుండి 3.10 వరకు.

సూర్యోదయం : 5.33
సూర్యాస్తమయం : 6.19
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు 

మేషం....  నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవర్తమానాలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలం.

వృషభం...  పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

మిథునం..  ప్రయాణాలు చివరిలో వాయిదా. శ్రమాధిక్యం. మిత్రులతో విభేదాలు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు.

కర్కాటకం....  పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వాహనయోగం. చర్చల్లో పురోగతి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం. వస్తులాభాలు.

సింహం....  రుణాలు చేయాల్సివస్తుంది. బంధువులతో అకారణ వైరం. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు తప్పకపోవచ్చు.

కన్య...  కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆస్తి లాభసూచనలు.  ప్రముఖుల పరిచయం. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు సైతం వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత రాణింపు.

తుల....  శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగక డీలాపడతారు.

వృశ్చికం....  పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. వస్తు, వస్త్రలాభాలు. ఆర్థిక ప్రగతి.  వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

ధనుస్సు...  నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. భూవివాదాల పరిష్కారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో అధిక లాభాలు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

మకరం.....  శ్రమ పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహిస్తారు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఎదురవుతాయి.

కుంభం....  రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులు, బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు.

మీనం...  వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తిలాభం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement