ఈ రాశి వారు వాహనాలు, భూములు కొంటారు | Rasi Phalalu: Daily Horoscope On 26-03-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారు వాహనాలు, భూములు కొంటారు

Mar 26 2026 4:46 AM | Updated on Mar 26 2026 4:54 AM

Rasi Phalalu: Daily Horoscope On 26-03-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం,వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.అష్టమి ప.2.43 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: ఆరుద్ర రా.7.04 వరకు తదుపరి పునర్వసు, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.10.05 నుండి 10.53 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.42 వరకు, అమృత ఘడియలు: ఉ.9.42 నుండి 11.12 వరకు.

సూర్యోదయం : 6.03
సూర్యాస్తమయం : 6.07
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు 

మేషం... నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. విందులువినోదాలు. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఉన్నతి. వాహనసౌఖ్యం.

వృషభం... ప్రయాణాలు వాయిదా. శ్రమ మరింత పెరుగుతుంది. పనుల్లో తొందరపాటు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో చికాకులు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మిథునం... కొన్ని పనులు విజయవంతంగా సాగుతాయి. నూతన ఉద్యోగలాభం. భూవివాదాలు పరిష్కారం. దైవదర్శనాలు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం... ఆకస్మిక ప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఇంటాబయటా సమస్యలు. వ్యాపార, ఉద్యోగాల్లో చికాకులు ఎదురవుతాయి.

సింహం... పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు.  శుభవార్తలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితి.

కన్య... విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. శుభవార్తా శ్రవణం. వాహనాలు, భూములు కొంటారు. విందువినోదాలు. వ్యాపారాభివృద్ధి. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి.

తుల.. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. వ్యయప్రయాసలు. పనులు మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు.

వృశ్చికం... పనులు కొన్ని మందగిస్తాయి. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. కుటుంబసమస్యలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆలయాలు సందర్శిస్తారు.

ధనుస్సు... కుటుంబంలో శుభకార్యాలు. విలువైన సమాచారం. ఆప్తులతో సఖ్యత. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కీలక పరిణామాలు.

మకరం... కొత్త ఉద్యోగాలు పొందుతారు. వేడుకల్లో పాల్గొంటారు. దైవదర్శనాలు. శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాల  పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

కుంభం... మిత్రులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళస్థితి.

మీనం... పనులు కొన్ని వాయిదా వేస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు కాస్త నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాల్లో మార్పులు సంభవం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement