ఈ రాశి వారికి ఆస్తి లాభ సూచనలు | Rasi Phalalu: Daily Horoscope On 25-05-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆస్తి లాభ సూచనలు

May 25 2026 4:02 AM | Updated on May 25 2026 5:07 AM

Rasi Phalalu: Daily Horoscope On 25-05-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధికజ్యేష్ఠ మాసం, తిథి: శు.నవమి ఉ.8.12 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: పుబ్బ ఉ.6.39 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం: ప.1.56 నుండి 3.33 వరకు, దుర్ముహూర్తం: ప.12.22 నుండి 1.13 వరకు తదుపరి ప.2.57 నుండి 3.48 వరకు, అమృత ఘడియలు: రా.11.40 నుండి 1.15 వరకు, రోహిణీ కార్తె ప్రారంభం.

సూర్యోదయం : 5.29
సూర్యాస్తమయం : 6.24
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం...  వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకులు.

వృషభం.....  ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. దూరప్రయాణాలు. పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం.

మిథునం.....  ఆహ్వానాలు అందుతాయి.. బాకీలు వసూలవుతాయి. కష్టానికి ఫలితం కనిపిస్తుంది. పరపతి పెరుగుతుంది. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

కర్కాటకం....  వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. దైవదర్శనాలు. ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.

సింహం....  నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి లాభ సూచనలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

కన్య....  వ్యయప్రయాసలు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

తుల.....  ఆశ్చర్యకరమైన రీతిలో సొమ్ము అందుతుంది. వివాదాలు పరిష్కరించుకుంటారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలస్థితిలో ఉంటాయి.

వృశ్చికం......  కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ధన, వస్తులాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

ధనుస్సు...  వ్యతిరేకుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.

మకరం.....  పనుల్లో గందరగోళం. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. కుటుంబంలో ఒడిదుడుకులు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు.

కుంభం....  కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తిలాభం. చిన్ననాటి మిత్రులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తీరతాయి.

మీనం...  పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ. వ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి. నూతన ఒప్పందాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

Advertisement
 
Advertisement
Advertisement