ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. శుభవర్తమానాలు | Rasi Phalalu: Daily Horoscope On 24-03-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. శుభవర్తమానాలు

Mar 24 2026 4:01 AM | Updated on Mar 24 2026 4:51 AM

Rasi Phalalu: Daily Horoscope On 24-03-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.షష్ఠి రా.7.23 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: రోహిణి రా.10.17 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం: ప.2.51 నుండి 4.20 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.28 నుండి 9.16 వరకు తదుపరి రా.10.55 నుండి 11.43 వరకు, అమృత ఘడియలు: రా.7.17 నుండి 8.46 వరకు

సూర్యోదయం : 6.05
సూర్యాస్తమయం :  6.07
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు 

మేషం..... స్నేహితులతో వివాదాలు. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆస్తి అగ్రిమెంట్లు వాయిదా. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

వృషభం.... కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. విద్యార్థులు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. వస్తులాభాలు. వ్యాపారులు అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.

మిథునం... ఇంటిలో ఒత్తిడులు. సోదరులు, స్నేహితులతో విభేదాలు. కార్యక్రమాలలో ఆటంకాలు. శారీరక రుగ్మతలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం.

కర్కాటకం. కార్యక్రమాలలో  పురోగతి. శుభకార్యాలపై చర్చలు. దేవాలయ దర్శనాలు. విందువినోదాలు. ఆసక్తికరమైన సమాచారం. వ్యాపారులకు లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఉన్నతస్థితి.

సింహం... కొత్త కార్యక్రమాలు  చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు లభిస్తాయి. వాహనయోగం. వ్యాపారులు ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులకు సహచరుల నుంచి సాయం.

కన్య.... కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. బంధువిరోధాలు. వ్యాపారులకు ఒత్తిడులు. ఉద్యోగులకు నిరాశాజనకం.

తుల..... కార్యక్రమాలు మందగిస్తాయి. వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారులకు ఒడిదుడుకులు. ఉద్యోగులకు నిరాశ. కళాకారులకు గందరగోళం. ఆరోగ్య సమస్యలు.

వృశ్చికం... ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు. నూతన పరిచయాలు. దూరపు బంధువుల కలయిక. వ్యాపారులు ఉత్సాహంతో సాగుతారు. ఉద్యోగులకు సన్మానాలు.

ధనుస్సు... ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో విభేదాలు తొలగుతాయి. కళాకారులకు సన్మానాలు. విందువినోదాలు. కుటుంబసౌఖ్యం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.

మకరం... కుటుంబసభ్యులతో బేధాభిప్రాయాలు. అదనపు ఖర్చులు. కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆరోగ్యసమస్యలు.  ప్రయాణాలు వాయిదా. వ్యాపారులకు సామాన్యం. ఉద్యోగులకు పనిఒత్తిడులు.

కుంభం..... ప్రయాణాలు వాయిదా.  కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలో ఆటుపోట్లు. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. శారీరక రుగ్మతలు.

మీనం... ఆకస్మిక ధనలబ్ధి. శుభవర్తమానాలు. వేడుకలు, సభల్లో పాల్గొంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు మరింత ఉత్సాహం. ఉద్యోగులకు ఊహించని బాధ్యతలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement