ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు | Rasi Phalalu: Daily Horoscope On 23-05-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు

May 23 2026 3:03 AM | Updated on May 23 2026 3:03 AM

Rasi Phalalu: Daily Horoscope On 23-05-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధికజ్యేష్ఠ మాసం, తిథి: శు.సప్తమి ఉ.10.27 వరకు తదుపరి అష్టమి, నక్షత్రం: ఆశ్లేష ఉ.7.29 వరకు తదుపరి మఖ, వర్జ్యం: రా.7.10 నుండి 8.44 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.30 నుండి 7.13 వరకు, అమృత ఘడియలు: ఉ.5.56 నుండి 7.30 వరకు.

సూర్యోదయం :    5.30
సూర్యాస్తమయం     :  6.23
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు

మేషం: వ్యవహారాలలో అవరోధాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

వృషభం: రుణాలు చేస్తారు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలలో చికాకులు.  ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. నిరుద్యోగులకు ఫలితం కనిపించదు.

మిథునం: ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. బంధువులతో సఖ్యత.  దైవదర్శనాలు.. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

కర్కాటకం: ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. బాధ్యతలు పెరుగుతాయి. పనుల్లో జాప్యం. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

సింహం: నూతన వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆర్థికాభివృద్ధి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో పురోగతి. వ్యాపారాలు విస్తరిస్తారు.  ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది.

కన్య: ప్రయాణాలు వాయిదా.  ఇంటాబయటా చికాకులు. మిత్రులతో కలహాలు.  అనారోగ్యం. వ్యాపారాలలో కొన్ని మార్పులు. ఉద్యోగాలలో సమస్యలు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు.

తుల: బంధువులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు పొందుతారు. ఆలయ దర్శనాలు. ఆస్తిలాభం. మిత్రుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోభివృద్ధి. వస్తులాభాలు.

వృశ్చికం: సోదరులతో సఖ్యత. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

ధనుస్సు: కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో ఒత్తిళ్లు. ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మకరం: ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. వ్యవహారాలలో ఆటంకాలు. వ్యాపారాలు మరింత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

కుంభం: నూతన ఉద్యోగావకాశాలు. ప్రముఖుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మీనం: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తిలాభం. మిత్రులు, బంధువుల కలయిక. విందువినోదాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు అనుకోని హోదాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement