ఈ రాశి వారికి శుభవార్తలు వింటారు.. ఆకస్మిక ధనలబ్ధి | Rasi Phalalu: Daily Horoscope On 13-04-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి శుభవార్తలు వింటారు.. ఆకస్మిక ధనలబ్ధి

Apr 13 2026 3:45 AM | Updated on Apr 13 2026 5:21 AM

Rasi Phalalu: Daily Horoscope On 13-04-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.ఏకాదశి రా.9.32 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: ధనిష్ఠ ప.12.48 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం: రా.8.09 నుండి 9.47 వరకు, దుర్ముహూర్తం: ప.12.24 నుండి 1.14 వరకు, తదుపరి ప.2.53 నుండి 3.42 వరకు,అమృత ఘడియలు: లేవు, సర్వ ఏకాదశి.

సూర్యోదయం : 5.49
సూర్యాస్తమయం : 6.10
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం... ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వ్యాపారాల వృద్ధి. ఉద్యోగాలలో ఉత్సాహం.

వృషభం... మిత్రులతో మరింత సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మిథునం.... అనుకున్న వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాల యత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.

కర్కాటకం...... వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

సింహం.... చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి. సంఘంలో ఆదరణ. విద్యార్థులకు అనుకూలస్థితి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కన్య... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలబ్ధి. వాహనాలు కొంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభం. ఉద్యోగాలలో హోదాలు.

తుల... రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. బంధువులతో విభేదాలు. ధనవ్యయం. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

వృశ్చికం..... వ్యవహారాలలో ఆటంకాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. దూరప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

ధనుస్సు.. కొన్ని సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి విషయాలు తెలుస్తాయి. వాహనసౌఖ్యం. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమర్థతను చాటుకుంటారు.

మకరం..... బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనులలో ప్రతిబంధకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

కుంభం... పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చల్లో అనుకూలత. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మీనం... వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. పనుల్లో జాప్యం. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement